EPF interest: ఈపీఎఫ్ఓ చందాదారులకు గుడ్ న్యూస్- త్వరలోనే ఖాతాల్లో వడ్డీ జమ!
EPFO: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పీఎఫ్ చందాదారుల ఖాతాల్లో 8.5 శాతం వడ్డీని జమ చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
EPF interest : దీపావళికి ముందే ఈపీఎఫ్ (ఉద్యోగుల భవిష్య నిధి) చందాదారులకు (EPFO good news) గుడ్ న్యూస్ చెప్పేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈపీఎఫ్ఓ ఖాతాలో త్వరలోనే వడ్డీ జమ చేయాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈపీఎఫ్ చందాదారులకు 8.5 శాతం వడ్డీ (EPFO interest rate for FY21) చెల్లించాలని ధర్మకర్తల బోర్డు ఈ ఏడాది మార్చిలో నిర్ణయించింది. తాజాగా ఇందుకు కేంద్రం ఆమోదం కూడా తెలిపినట్లు సమాచారం.
అదే నిజమైతే త్వరలోనే 5 కోట్లకుపైగా ఈపీఎఫ్ఓ చందాదారుల ఖాతాల్లో వడ్డీ జమ కానుంది.
Also read: Puneet Rajkumar Died: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతి.. శోకసంద్రంలో అభిమానులు
Also read: Puneeth Rajkumar Death : కంఠీరవం స్టేడియానికి పునీత్ రాజ్‌కుమార్ పార్థీవ దేహం
ఇంతకు ముందు వడ్డీ రేట్లు ఇలా..
2018-19 ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్‌పై వడ్డీ రేటు 8.65 శాతం ఉండగా, 2019-20 ఆర్థిక సంవత్సరంలో ధర్మకర్తల బోర్డు దాన్ని 8.5 శాతానికి తగ్గించింది. అంతకు ముందు ఏడేళ్లతో పోలిస్తే ఇదే అత్యల్ప వడ్డీ (Lowest EPF Interest rate) రేటు. కరోనా కారణంగా.. అత్యల్ప వడ్డీ రేటును చెల్లించాలని నిర్ణయించినట్లు ఈపీఎఫ్ఓ వివరణ ఇచ్చింది. 2020-21 వడ్డీ రేట్లులోనూ ఎలాంటి మార్పులు చేయలేదు ఈపీఎఫ్ఓ ధర్మకర్తల బోర్డు.
Also read: Petrol Price today: వరుసగా మూడో రోజూ పెట్రో బాదుడు- కొత్త రికార్డు స్థాయికి ధరలు
Also read: RBI Governor: ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పదవీ కాలం పొడగింపు- మరో మూడేళ్లు సేవలు!
పీఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్ చూసుకోవడం ఎలా?
పీఎఫ్ ఖాతాదారులు తమ అకౌంట్లో బ్యాలెన్స్ తెలుసుకునేందుకు (How to Know EPFO Balance) వివిధ మార్గాలు అందుబాటులో ఉన్నాయి.
1. ఈపీఎఫ్ఓ టోల్ ఫ్రీ నంబర్ '011-22901406' కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా (EPF missed call service) ఎస్ఎంఎస్ రూపంలో పీఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్ వివరాలను పొందొచ్చు. అయితే ఈపీఎఫ్ఓ వద్ద రిజిస్ట్రర్ అయిన మొబైల్ నంబర్ నుంచి మాత్రమే ఈ సదుపాయం వినియోగించుకునేందుకు వీలుంది.
2. EPFOHO UAN అని టైప్ చేసి 7738299899 నంబర్‌కు.. రిజిస్ట్రర్ మొబైల్ నంబర్ నుంచి ఎస్ఎంఎస్ పంపడం ద్వారా (EPF SMS service) కూడా.. బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవచ్చు.
3.ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్‌లోకి లాగిన్ అవడం ద్వారా. పాస్‌బుక్‌ను యాక్సెస్ (EPF balance with UMANG app) చేయొచ్చు. ఇందులో ప్రతి నెల ఎంత మొత్తం పీఎఫ్ జమ అవుతుంది. ఉద్యోగి వాటా ఎంత? కంపెనీ వాటా ఎంత? సహా ఇప్పటి వరకు జమ అయిన వడ్డీ వంటి వివరాలను కూడా తెలుకునే అవకాశముంది.
4. ఉమాంగ్ యాప్ ద్వారా కూడా పీఎఫ్ పాస్‌బుక్‌ను యాక్సెస్ చేయొచ్చు. అయితే ముందుగా ఉమాంగ్‌లో రిజిస్ట్రర్ చేసుకోవాల్సి ఉంటుంది.
Also Read: Petrol Price today: వరుసగా మూడో రోజూ పెట్రో బాదుడు- కొత్త రికార్డు స్థాయికి ధరలు
Also Read: IRCTC Share News Today: కేంద్రం నిర్ణయంతో పడిలేచిన ఐఆర్‌సీటీసీ షేర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook