EPF Passbook Password: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఖాతాలు కలిగి ఉన్న ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు 2019-20 ఆర్థిక సంవత్సరానికి 8.5 శాతం ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటు లభించింది. తమ ఖాతాదారుల పీఎఫ్ నగదును ఈపీఎఫ్ ఖాతాల్లో ఈపీఎఫ్ఓ జమ చేసింది. అయితే EPF వడ్డీ రేటును EPF పాస్‌బుక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


EPFO హోమ్ పేజీలో లాగిన్ అయ్యి పాస్‌బుక్ వివరాలు చెక్ చేసుకోవడానికి మీ వివరాలు నమోదు చేయాలి. అయితే మీరు ఈపీఎఫ్ఓ పాస్‌వర్డ్(EPFO Latest Updates) మరచిపోయినప్పుడు ఎలా అని ఖాతాదారులు ఆందోళన చెందుతుంటారు. పాస్‌వర్డ్ తిరిగి పొందాలంటే ఈ కింది విధంగా చేస్తే సరి. forgot password ద్వారా మీ వివరాలు తేలికగా పొందవచ్చు.


 


Also Read: EPFO: మీరు ఈపీఎఫ్ ఖాతాదారులా, అయితే ఈజీగా EPF Passbook Download చేసుకోండి



మీ EPF పాస్‌వర్డ్‌ను తిరిగి పొందడానికి ఇది పాటించండి (How to recover EPF Passbook Password)


1) ఈపీఎఫ్ పాస్‌బుక్ పోర్టల్‌ EPF Passbook లింక్ ఓపెన్ చేయండి  


2) Forgot Password ఆప్షన్‌పై క్లిక్ చేయండి


3) మీ UAN నెంబర్, కాప్చా వివరాలు నమోదు చేయండి


Also Read: EPF Balance Check: ఈపీఎఫ్ఓ ఖాతాల్లోకి EPF Interest జమ, మీ బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోండి



4) వెరిఫై బటన్ మీద క్లిక్ చేయాలి


5) మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ కనిపిస్తుంది


6) మీ పేరు, పుట్టిన తేదీ, Gender, KYC టైప్ మరియు డాక్యుమెంట్ నెంబర్ వివరాలను నమోదు చేయండి


7) Verify బటన్ పై క్లిక్ చేయండి


8) మీ వివరాలు పరిశీలన అయిన తర్వాత, మీ మొబైల్ నంబర్‌‌కు OTP వస్తుంది


9) కొత్త పాస్‌వర్డ్‌ను టైప్‌చేసి, కన్ఫామ్ పాస్‌వర్డ్ కూడా నమోదు చేయాలి


10) పాస్‌వర్డ్ విజయవంతంగా మార్చారని సందేశం తెరమీద కనిపిస్తుంది. కొత్త పాస్‌వర్డ్‌తో లాగిన్ అయి వివరాలు చెక్ చేసుకోవచ్చు.


Also Read: EPF Wage Ceiling: ఈపీఎఫ్ పరిమితి రూ.15,000 నుంచి రూ.21,000కు పెంచే యోచనలో ప్రభుత్వం 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook