EPFO Alert: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త, జాబ్ కోల్పోయినా COVID-19 అడ్వాన్స్ నగదు సాయం
EPFO Alert to EPF Account Holders: కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఉద్యోగం కోల్పోయిన ఎంప్లాయీస్ ప్రావెండెంట్ ఫండ్ ఖాతాదారులకు ఈ ప్రయోజనం అందిస్తున్నట్లు ఈపీఎఫ్‌వో తెలిపింది. ఈ మేరకు ఈపీఎఫ్‌వో తమ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ఓ పోస్ట్ చేసింది.
EPFO Alert to EPF Account Holders: తన ఖాతాదారులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మరో శుభవార్త అందించింది. కరోనా వ్యాప్తి సమయంలో తన ఖాతాదారులైన ఆరు కోట్లకు పైగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు కోవిడ్19 అడ్వాన్స్‌గా నగదు విత్‌డ్రా చేసుకునే వెసలుబాటు ఇటీవల కల్పించడం తెలిసిందే. తాజాగా కోవిడ్19 సెకండ్ అడ్వాన్స్ నగదుపై ఓ అప్‌డేట్ అందించింది.
కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఉద్యోగం కోల్పోయిన ఎంప్లాయీస్ ప్రావెండెంట్ ఫండ్ ఖాతాదారులకు ఈ ప్రయోజనం అందిస్తున్నట్లు ఈపీఎఫ్‌వో తెలిపింది. ఈ మేరకు ఈపీఎఫ్‌వో (EPFO Official Website) తమ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ఓ పోస్ట్ చేసింది. కోవిడ్-19 నాన్-రిఫండబుల్ అడ్వాన్స్ కింద ఈపీఎఫ్ ఖాతాల్లోని 75 శాతం వరకు నగదును కొన్ని సందర్భాలలో ఉపసంహరించుకునే వెసలుబాటు కల్పించింది. అదే సమయంలో ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాను యతాతథంగా కొనసాగించవచ్చునని తెలిపింది.. ఈపీఎఫ్ ఖాతాను క్లోజ్ చేయడం, తొలగించడం లాంటి చర్యలు తీసుకోవడం లేదని ఈపీఎఫ్‌వో అధికారులు చెబుతున్నారు.
Also Read: EPF Interest Amount: 6 కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త, వడ్డీ నగదుపై కీలక నిర్ణయం
ఇటీవల కుటుంబసభ్యులకు కరోనా సోకితే చికిత్స అందించడానికి, ఆర్థిక సహాయంలో భాగంగా కోవిడ్19 అడ్వాన్స్ అందిస్తోందని తెలిసిందే. అయితే ఉద్యోగం కోల్పోయిన వారికి సైతం ఈ ప్రయోజనాలు కల్పించాలని ఈపీఎఫ్‌వో (EPFO) ముందుకొచ్చింది. అయితే నిరుద్యోగులైన ఈపీఎఫ్ ఖాతాదారులకు జాబ్ మానేయడం, లేదా కోల్పోవడం జరిగి కనీసం నెల రోజులు గడిచిన వారికి మాత్రమే కోవిడ్19 నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ వర్తిస్తుందని వివరించింది.
ఉద్యోగులకు మూడు నెలల ఈపీఎఫ్ అలవెన్స్ లేదా 75 శాతం ఈపీఎఫ్ నగదులలో ఏది తక్కువైతే దానిని ఖాతాదారులకు అందిస్తామని స్పష్టం చేసింది. కోవిడ్19 అడ్వాన్స్ క్లెయిమ్ చేసుకున్న వారికి కేవలం 3 రోజుల్లోనే నగదు చేతికి అందించాలన్న నిర్ణయంతో ఈపీఎఫ్ ఖాతాదారుల (EPF Subscribers)కు ఇటీవల ఊరట కలిగించింది. కేవైసీ పూర్తి చేసుకున్న ఈపీఎఫ్ ఖాతాదారులకు మాత్రమే ఈ అవకాశాన్ని కల్పించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook