e Nomination Process: మీ పీఎఫ్ ఖాతా ఇ నామినేషన్ దాఖలైందా, ఇ నామినేషన్ ఎలా చేయాలి, లాభాలేంటి
e Nomination Process: ఈపీఎఫ్ఓలో ఎప్పటికప్పుడు కీలకమైన అప్‌డేట్స్ వస్తున్నాయి. ఈపీఎఫ్ ఇ నామినేషన్ ఇందులో ఒకటి. ఇ నామినేషన్ ఎలా చేయాలి, ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
e Nomination Process: ఈపీఎఫ్ఓలో ఎప్పటికప్పుడు కీలకమైన అప్‌డేట్స్ వస్తున్నాయి. ఈపీఎఫ్ ఇ నామినేషన్ ఇందులో ఒకటి. ఇ నామినేషన్ ఎలా చేయాలి, ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
ఈపీఎఫ్ఓ కార్యాలయం ఈ ఏడాది మార్చ్ నెల నుంచి ఈపీఎఫ్ ఖాతాల కుటుంబసభ్యుల కోసం ఇ నామినేషన్ ప్రారంభించింది. ఈపీఎఫ్ఓ ఖాతాదారుడు మరణించినప్పుడు ఇ నామినేషన్ ఉపయోగపడుతుంది. పీఎఫ్ ఎక్కౌంట్‌లో జమ చేసిన మొత్తం డ్రా చేయాలంటే కుటుంబసభ్యుల్లో తల్లిదండ్రులు, పిల్లలు, భార్య లేదా భర్త నామినేషన్ తప్పనిసరి. దీనికి గడువు తేదీ అంటూ లేదు. ఎప్పుడైనా సరే ఇ నామినేషన్ దాఖలు చేయవచ్చు. ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం కుటుంబం అంటే సభ్యుడి భార్య లేదా భర్త,మైనర్ పిల్లలు, దత్తత తీసుకున్న పిల్లలు ఉంటారు.
ఈపీఎఫ్ఓ సంస్థ ఈపీఎఫ్ ఖాతాల్లో ఇ నామినేషన్ ప్రక్రియ కోసం ఆన్‌లైన్ విధానం ప్రారంభించింది. epfindia.gov వెబ్‌సైట్‌లో వెళ్లి డిజిటల్ విధానంలో ఇ నామినేషన్ దాఖలు చేయవచ్చు. దీనికోసం యూఏఎన్ నెంబర్ అవసరం.
ఇ నామినేషన్ ప్రయోజనాలు
సభ్యుడు మరణిస్తే..ఆన్‌లైన్ విధానంలో క్లెయిమ్ చేసుకోవచ్చు. నామినీకు పీఎఫ్, పెన్షన్, భీమా అందుతాయి. ఈ ప్రక్రియ పేపర్ లెస్‌గా ఉంటుంది. త్వరగా అవుతుంది.
ఇ నామినేషన్ ఎలా
ముందుగా epfindia.gov.in వెబ్‌సైట్‌లో వెళ్లి యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి. మేనేజ్ సెక్షన్‌లో ఇ నామినేషన్ క్లిక్ చేయాలి. కుటుంబం ఉంటే ఎస్ క్లిక్ చేసి..సభ్యులకు చెందిన ఆధార్, పేరు, పుట్టిన తేదీ, లింగం, సంబంధం, చిరునామా, బ్యాంక్ ఎక్కౌంట్ వంటి వివరాలు నమోదు చేయాలి. ఒకరి కంటే ఎక్కువమందిని కూడా నామినీగా చేర్చవచ్చు.
Also read: Investment plan: నెలకు వేయి రూపాయల పెట్టుబడితో..2 కోట్ల ఆదాయం, ఎలాగంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook