EPFO Nominee Rules: పీఎఫ్ ఎక్కౌంట్‌లో నామినీ అనేది తప్పకుండా ఉండాలి. ఎందుకంటే సదరు ఉద్యోగి నామినీ చేర్చకుంటే ఆ ఉద్యోగి మరణానంతరం పీఎఫ్ క్లెయిమ్ తీసుకునేందుకు సివిల్ కోర్టు నుంచి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది. అందుకే ఈపీఎఫ్ఓ నిబంధలు పరిశీలించుకోవాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇప్పుడు ఈపీఎఫ్ఓ సభ్యులకు ఇ నామినేషన్ తప్పనిసరి చేసింది. నామినీ లేకుంటే ఈపీఎఫ్ఓ సౌకర్యాలు ఎక్కువ కాలం పొందేందుకు వీలుండదు. అందుకే ప్రతి ఈపీఎఫ్ ఎక్కౌంట్ ఇకపై విధిగా నామినీ కలిగి ఉండాలి. పీఎఫ్ ఎక్కౌంట్ హోల్డర్ నామినీ యాడ్ చేస్తే..అతని లేదా ఆమె మరణానంతరం చాలా సులభంగా ఆ నామినీకు డబ్బు అందుతుంది. ఈపీఎఫా్ఓ ఒకటి కంటే ఎక్కువ నామినీలను చేర్చే సౌకర్యం కల్పిస్తోంది. అంటే ఇకపై పీఫ్ ఎక్కౌంట్ హోల్డర్ తన భార్యనే కాకుండా కొడుకు, కుమార్తెను కూడా నామినీగా చేర్చవచ్చు. ఈపీఎఫ్ నామినీ అనేది ఆన్‌లైన్ ద్వారా చేయాల్సి ఉంటుంది. పీఎఫ్ లాబాలు పొందేందుకు ఇ నామినేషన్ ఉపయోగపడుతుంది. పీఎఫ్ ఎక్కౌంట్ హోల్డర్ మరణిస్తే ఆన్‌లైన్ క్లెయిమ్, సెటిల్‌మెంట్, ప్రోవిడెంట్ ఫండ్ అన్నీ సునాయసంగా అందగలవు. 


పీఎఫ్ ఎక్కౌంట్ హోల్డర్ నామినీగా తన కుటుంబసభ్యుల్నే చేర్చగలడు. ఒకవేళ ఆ వ్యక్తికి కుటుంబం లేకుంటే అప్పుడు మాత్రం మరో వ్యక్తిని నామినీగా చేర్చగలడు. ఒకవేళ నామినీగా వేరే వ్యక్తిని చేర్చిన తరువాత ఆ వ్యక్తి కుటుంబం గురించి తెలిస్తే ఆ నామినేషన్ రద్దయిపోతుంది. 


పీఎఫ్ ఎక్కౌంట్‌లో ఒకరి కంటే ఎక్కువ నామినీలను చేర్చవచ్చు. ఒకరి కంటే ఎక్కువ నామినీలుంటే ప్రతి నామినీకు ఎంత శాతం చెల్లించాలనేది స్పష్టంగా ఉదహరించాల్సి ఉంటుంది. 
ఈపీఎఫ్ఓ ఇ నామినేషన్ తప్పనిసరి చేసింది. అయినా ఎవరైనా ఎక్కౌంట్ హోల్డర్ ఇ నామినీ చేర్చకపోతే పీఎఫ్ బ్యాలెన్స్, పాస్‌బుక్ చూడలేడు. ఇ నామినేషన్ కోసం ఎక్కౌంట్ హోల్డర్ యూఏఎన్ నెంబర్ యాక్టివ్‌గా ఉండి తీరాలి. ఆధార్ , మొబైల్ నెంబర్‌కు లింక్ అయి ఉండాలి. 


Also read: Senior Citizens Savings Scheme: ఇలా ఇన్వెస్ట్ చేస్తే నెలకు 20 వేల నుంచి 40 వేల వరకూ ఆదాయం పొందవచ్చు



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook