దీపావళికి ముందు పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్ అందిస్తోంది ఈఫీఎఫ్ కార్యాలయం. 2022 ఆర్ధిక సంవత్సరంలోనే మీ పీఎఫ్ ఖాతాల్లో భారీగా డబ్బులు చేరనున్నాయి. ఎప్పుడు, ఎలా, ఎవరికో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలోని 7 కోట్ల పీఎఫ్ ఖాతాదారుల ఖాతాల్లో ఈ నెలాఖరులోగా భారీగా డబ్బులు జమకానున్నాయి. ఈపీఎప్ ఖాతాలో 2022 ఆర్ధిక సంవత్సరపు వడ్డీ బదిలీ కానుంది. ఈ సారి8.1 శాతం వడ్డీ లభించనుంది. ఈ నెలాఖరులోగా వడ్డీ డబ్బులు ఖాతాల్లో జమ కానున్నాయని తెలుస్తోంది. పీఎఫ్‌పై ఈ ఏడాది ఇస్తున్న వడ్డీ 40 ఏళ్ల కనిష్ట వడ్డీ కావడం గమనార్హం.


పీఎఫ్ వడ్డీ లెక్కింపు ఇలా


మీ పీఎఫ్ ఖాతాలో 10 లక్షల రూపాయలుంటే 8.1 శాతం వడ్డీ చొప్పున 81 వేలు జమకానున్నాయి. అదే మీ పీఎఫ్ ఖాతాలో 7 లక్షల రూపాయలుంటే 56,700 రూపాయలు వడ్డీ లభిస్తుంది. 5 లక్షల రూపాయలు మీ ఖాతాలో ఉంటే 40,500 రూపాయలు వడ్డీ రూపంలో లభించనున్నాయి. లక్ష రూపాయలుంటే 8,100 రూపాయలు క్రెడిట్ అవుతాయి.


మీ పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ చెక్ చేసేందుకు మీ రిజస్టర్డ్ మొబైల్ నెంబర్ ద్వారా 011-22901406 కు మిస్డ్‌కాల్ ఇస్తే మీకు ఈపీఎఫ్ఓ కార్యాలయం నుంచి వివరాలు మెస్సేజ్ రూపంలో లభిస్తాయి. దీనికోసం మీ యూఏఎన్ నెంబర్, పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ కావల్సి ఉంటుంది.


ఆన్‌‌లైన్ విధానంలో చెక్ చేసేందుకు epfindia.gov.in లాగిన్ కావాలి. అందులో ఈ పాస్‌బుక్ ఎంటర్ చేసి..అడిగిన వివరాలు సమర్పించాలి. అంతే స్క్రీన్‌పై మీ బ్యాలెన్స్ వివరాలు లభిస్తాయి. ఇక మెస్సేజ్ ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. దీనికోసం మీ యూఎన్ నెంబర్‌కు మీ మొబైల్ నెంబర్ రిజస్టర్ అయుండాలి. దీనికోసం  7738299899  నెంబర్‌కు EPFOHO అని టైప్ చేసి పంపితే సరిపోతుంది.


Also read: Vivo 5G Software Updates: వివో 5G స్మార్ట్‌ఫోన్స్‌కి సాప్ట్‌వేర్ అప్‌డేట్స్‌పై గుడ్ న్యూస్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook