EPS ALERT Centre may separate EPF and pension accounts: ఈపీఎఫ్‌ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు పింఛను చెల్లించేందుకు ఏర్పాటు చేసిన ఉద్యోగులు పింఛను పథకం (ఈపీఎస్‌) (Employee Pension Scheme) లో మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌) (NPS) తరహాలో ప్రత్యేక ఖాతా నిర్వహించాలని యోచిస్తోంది. మొత్తంపై వడ్డీని పింఛనుగా ఇచ్చే ప్రతిపాదన పరిశీలిస్తోంది. పదవీ విరమణ తర్వాత పింఛను మొత్తం కాస్త ఎక్కువగా పొందేలా చేసేందుకు సంస్కరణలు చేపట్టబోతుంది కేంద్రం. ఇక ఉద్యోగం మధ్యలో మానేసినా కూడా రెండేళ్ల వరకు ఈపీఎస్‌ (EPS) నుంచి డబ్బు డ్రా చేయకుండా నిషేధం విధించాలనుకుంటోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

58 ఏళ్ల వయసు తర్వాత 


పదవీ విరమణ పొందిన వారికి ఈపీఎఫ్‌ఓ (ఉద్యోగుల భవిష్య నిధి) (EPFO) సామాజిక భద్రత కల్పిస్తోంది. ఈపీఎఫ్‌ ఖాతాలోని డబ్బు మొత్తం పదవీ విరమణ తర్వాత పొందవచ్చు. అయితే  ఈపీఎఫ్‌ పింఛను పొందేందుకు ఉద్యోగి సొంతంగా ఈపీఎస్‌ ఖాతాలో ఒక్క రూపాయి కూడా జమచేయాల్సిన అవసరం లేదు. పదేళ్ల పాటు ఈపీఎఫ్‌వో చందాదారుగా సర్వీసు పూర్తి చేస్తే వారికి ఈపీఎఫ్‌ పింఛను వస్తుంది. అయితే ప్రస్తుత నిబంధనల ప్రకారం పదవీ విరమణ చేసినపుడు ఆ ఉద్యోగి సర్వీసు ఆధారంగా పింఛను మదింపు జరుగుతోంది. పదేళ్ల సర్వీసు ముగిసినంత మాత్రానా ఈపీఎస్‌ ఖాతాలో నగదు ఉపసంహరించే అవకాశం ఉద్యోగికి ఉండదు. ఉద్యోగం మానేసిన తర్వాత సర్టిఫికెట్‌ వస్తుంది. దీంతో 58 ఏళ్ల వయసు తర్వాత పింఛనుకు దరఖాస్తు చేసుకోవచ్చు.


Also Read : CSK vs MI match Highlights: అదరగొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. ముంబైపై చెన్నై ఘన విజయం


కేంద్రం మార్పుల చేసే అంశాలు ఇవే


ఉద్యోగుల పింఛను కోసం ఇక నుంచి ఈపీఎస్‌ (EPS) ఖాతా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ఖాతాలో యజమాని వాటాకు అదనంగా, ఉద్యోగి కోరుకుంటే సొంతగా జమ చేసుకోవచ్చు. ఏటా ఈపీఎఫ్‌వో నిర్ణయించే వడ్డీని ఈపీఎస్‌లోని డబ్బు మొత్తానికి వర్తింపచేసి లెక్కిస్తారు. 58 ఏళ్ల సర్వీసు తర్వాత ఈపీఎస్‌ ఖాతాలోని (EPS account) మొత్తంపై వడ్డీని పింఛనుగా ఇస్తారు. అలాగే పదవీ విరమణ చేసినపుడు తక్కువగా.. ఆ తర్వాత ఎక్కువ మొత్తంలో పింఛను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు ఆ ఉద్యోగి ఒకవేళ మరణిస్తే తర్వాత అతని జీవిత భాగస్వామికి పింఛను, ఆ తర్వాత వారసులకు నిల్వలు అందుతాయి.


Also Read : Heavy Rains Alert: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook