Equity Mutual Funds: ఈక్విటీ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి గుడ్‌న్యూస్. మార్కెట్‌లో ఈక్విటీ ఫండ్స్ జోరు పెరుగుతోంది. భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ సంస్థ అసోసియేషన్ డేటా ప్రకారం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

షేర్ మార్కెట్, ఈక్విటీ మార్కెట్(Equity Market) ఆశాజనకంగా కన్పిస్తోంది. ముఖ్యంగా ఈక్విటీ సెక్టార్‌లో పెట్టుబడులకు మంచి అవకాశంగా ఉంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో భారీగా పెట్టుబడులు వస్తుండటమే దీనికి కారణం. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నికరంగా 39 వేల 927 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దీనికి సంబంధించి మ్యూచువల్ ఫండ్స్ (Mutual Funds)సంస్థల అసోసియేషన్ డేటా విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం..


ఇదే ఏడాది జూన్ త్రైమాసికంలో ఈక్విటీ పథకాల్లోకి(Equity Schemes)వచ్చిన పెట్టుబడులు 19 వేల 508 కోట్లున్నాయి. ఈ త్రైమాసికానికి ఇది దాదాపుగా రెట్టింపైంది. నూతన పథకాల ఆవిష్కరణ (NFO)సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (SIP)రూపంలో పెట్టుబడులు స్థిరంగా ఉండడం దోహదపడిందని మార్కెట్ నిపుణుల విశ్లేషణ. మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ (AMFI)ఈ మేరకు గణాంకాల్ని విడుదల చేసింది. సెప్టెంబర్‌ ఆఖరుకు ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలోని ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువ 12.8 లక్షల కోట్లుగా ఉంది. జూన్ నాటికి ఈ విలువ 11.1 లక్షల కోట్లుగా ఉంది. 2020 జూలై నుంచి 2021 ఫిబ్రవరి వరకు ఈక్విటీ పథకాల నుంచి నికరంగా పెట్టుబడులు బయటకు వెళ్లాయి. ఈ ఏడాది మార్చి నుంచి నికరంగా పెట్టుబడులు వస్తున్నాయి.ఈక్విటీ పథకాల్లోకి వచ్చే నికర పెట్టుబడుల్లో 50 శాతం ఎన్‌ఎఫ్‌వోల నుంచే ఉంటున్నట్టు పరిశ్రమకు చెందిన నిపుణులు తెలిపారు. ఈక్విటీల్లో ఫ్లెక్సీక్యాప్‌ విభాగం అత్యధికంగా 18 వేల 258 కోట్లను ఆకర్షించగా..సెక్టోరల్‌ ఫండ్స్‌ 10 వేల 232 కోట్లు, ఫోకస్డ్‌ ఫండ్స్‌ 4 వేల 197 కోట్లు, మల్టీక్యాప్‌ ఫండ్స్‌ 3 వేల 716 కోట్లు, మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌ 3 వేల కోట్ల చొప్పున సెప్టెంబర్‌ త్రైమాసికంలో(September Quarter) నికరంగా పెట్టుబడులు ఆకర్షించాయి.


Also read: China New Rules: ఆ విదేశీ కంపెనీలు చైనాను ఎందుకు వదిలేశాయి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook