Gold and Silver Rates :   బంగారం ధర ఆకాశమే హద్దుగా చెలరేగిపోతోంది. బంగారం ధరలు నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,680గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 71,210గా ఉన్నాయి. అయితే బంగారం ధరలు ఈ స్థాయిలో పెరగడం చరిత్రలోనే తొలిసారి అని చెప్పవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా గల్ఫ్ దేశాల్లో ప్రారంభమైన ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధం ఒక కారణంగా చెబుతున్నారు. బంగారం ధరలు ఏరోజుకారోజు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. బంగారం ధర గడచిన ఐదు సంవత్సరాలుగా చూసినట్లయితే దాదాపు 120 శాతం పెరిగింది. బంగారం ధరలు ఈ రేంజ్ లో పెరుగుతాయని ఎవరు భావించలేదు. నిజానికి బంగారం ధర పెరగడానికి ప్రధానంగా చైనాను కారణంగా చెప్పవచ్చు. గడచిన రెండు మూడు సంవత్సరాలుగా చైనా విపరీతంగా బంగారం కొనుగోలు చేస్తోంది. 


ముఖ్యంగా తమ పెట్టుబడులను అమెరికా ట్రెజరీ బాండ్ల నుంచి ఇన్వెస్టర్లు నెమ్మదిగా బంగారం వైపు తరలించడం కూడా బంగారం పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. అలాగే బంగారం ధరలు పెరుగుదల అనేది ఆర్థిక సంక్షోభాన్ని సూచిస్తుందని వ్యాపార నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైనా సంక్షోభ సమయంలో బంగారం ధర మాత్రమే పెరుగుతుంది. స్టాక్ మార్కెట్ వంటివి పతనం అవుతాయి. 


బంగారం ధరలు సమీప భవిష్యత్తులో దిగి వస్తాయా లేదా అనే సందేహం మీకు కలగవచ్చు. కానీ ఇప్పుడు అమెరికా సహా అంతర్జాతీయంగా  ఉన్న పరిస్థితులను చూసినట్లయితే, బంగారం ధర ఇప్పట్లో తగ్గే అవకాశం కనిపించడం లేదు. దీనికి తోడు బంగారం ధర అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావంతో కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బంగారం ధర భవిష్యత్తులో ఈ ఏడాది చివరి నాటికి 85000 నుంచి 95 వేల మధ్య ట్రేడ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. కొత్త సంవత్సరంలో అయితే బంగారం ధర దాదాపు ఒక లక్ష రూపాయలు దాటే అవకాశం కనిపిస్తోంది. అంటే తులం బంగారం కొనుగోలు చేయాలంటే దాదాపు లక్ష రూపాయలు ఖర్చు పెట్టాల్సి అవసరం ఏర్పడుతుంది. 


Also Read: Richest State in India: దేశంలో అత్యంత ధనిక రాష్ట్రం మహారాష్ట్ర .. తలసారి ఆదాయంలో తెలంగాణే నెంబర్ వన్


బంగారు ధరలు పెరగడం వెనుక మరో ప్రధానమైన కారణం. అమెరికా డాలర్ విలువ పతనం కూడా అని చెప్పవచ్చు. డాలర్ విలువ పతనమైనప్పుడల్లా బంగారం ధర పెరుగుతుంది. ప్రస్తుతం డాలర్ 9 నెలల కనిష్ట స్థాయికి చేరింది. దీంతో బంగారం ధర కూడా పెరగడం ప్రారంభించింది. ఎందుకంటే డాలర్ మారకం విలువ తగ్గడం ఇన్వెస్టర్లలో భయాన్ని పెంచుతుంది. ఫలితంగా తమ పెట్టుబడులను బంగారం వైపు తరలిస్తారు.


Also Read: Supreme Court: ఇదే చివరి హెచ్చరిక.. ఓపిక నశించింది.. రాష్ట్రాల సీఎస్‎లకు సుప్రీం చివాట్లు..అసలేం జరిగిందంటే?  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి