GST On Old Cars: మనం పాత కారు అమ్మాలంటే జీఎస్టీ చెల్లించాలా. సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం 18శాతం ట్యాక్స్ వసూలు చేయాలని నిర్ణయం తీసుకుందా. రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఇదే అంశంగా గురించి జోరుగా చర్చ జరుగుతోంది. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్ డిసెంబర్ 21వ తేదీన జైసల్మీర్ లో సమావేశం అయ్యింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించింది. ఈ భేటీ అనంతరం పాత కార్ల విక్రయంపై జీఎస్టీ విధింపు చర్చనీయాంశంగా మారింది. పాప్ కార్న్ తో మొదలుపెట్టి పాత కార్లనూ వదిలిపెట్టలేదంటూ సోషల్ మీడియాలో మీమ్స్ తో సెటైర్లు వేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జీఎస్టీ కౌన్సిల్ ఏం నిర్ణయం తీసుకున్నారు. పాత కార్లను విక్రయిస్తే జీఎస్టీ ఎంత చెల్లించాలి. అందరికీ ఇది వర్తిస్తుందా? కారు అసలు ధర మీద జీఎస్టీ లెక్కిస్తారా . కారు ఓనర్ నష్టపోయే పరిస్ధితి ఉన్నా..జీఎస్టీ చెల్లించాల్సిందేనా ఇలా ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం. 


 




అసలు నిజం ఏంటంటే పార్థ కార్ల విక్రయంపై 18శాతం జీఎస్టీ విధించేందుకు జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నది నిజమే. అయితే ఇక్కడ ముఖ్యమైన సంగతి ఏంటంటే వ్యక్తిగతంగా కార్లను విక్రయించినప్పుడు ఎలాంటి జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల కొంత గందరగోళ పరిస్ధితి నెలకొంది. వాస్తవానికి పాత కార్ల విక్రయాలపై ఇప్పటికే 12శాతం జీఎస్టీ ఉంది. దీన్ని 18శాతానికి పెంచేందుకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించారు. పెట్రోల్, డీజీల్ కార్లతోపాటు ఎలక్ట్రిక్ కార్లకు కూడా జీఎస్టీ వర్తిస్తుంది. అయితే ఈ ప్రభావం డీలర్లపైనే పడుతుంది. అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తికి కారును అమ్మితే..ఎలాంటి జీఎస్టీ ఉండదు. కారును అమ్మేవారికిపైనా, కొనేవారిపైనా ఎలాంటి ప్రభావం ఉండదు. కొత్త కార్లు కొనలేనివారు డీలర్ వద్ద నుంచి సెకండ్ హ్యాండ్ కారు కొంటారు. ఇలాంటి సందర్భాల్లో జీఎస్టీ వర్తిస్తుంది. ఇదంతా అవాస్తవం. 


Also read: Rain Alert: బలపడిన అల్పపీడనం వచ్చే మూడు రోజులు ఏపీలో విస్తారంగా వర్షాలు



 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook