రితేష్ దేశ్‌ముఖ్ టు ముకేష్ అంబానీ.. ఇండియాలో ఎంత మంది వద్ద Tesla cars ఉన్నాయో తెలుసా?
Tesla Cars: ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా దేశీయ విపణిలోకి అడుగుపెట్టేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో భారత్ లో టెస్లా కారును కలిగి ఉన్న కొంత మంది ప్రముఖ వ్యక్తుల గురించి తెలుసుకుందాం.
Famous Tesla owners in India: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా (Tesla Cars) భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. అయితే ఆ సంస్థ భారత ప్రభుత్వంతో కొన్ని సమస్యలను ఎదుర్కొంటుంది. ఈ సందర్భంగా మనదేశంలో టెస్లా కార్లను కొనుగోలు చేసిన కొంత మంది భారతీయులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1. రితీష్ దేశ్‌ముఖ్ (Riteish Deshmukh)
టెస్లా మోడల్ X (Tesla Model X):
బాలీవుడ్ లో హస్యచిత్రాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు రితీష్ దేశ్‌ముఖ్ (Riteish Deshmukh). రితీష్ కు ఆయన భార్య, ప్రముఖ నటి జెనీలియా టెస్లా మోడల్ X కారును ఆయనకు బహుమతిగా ఇచ్చింది. ఇది ఎరుపు రంగులో ఉంటూ...ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఈ ఫ్లాగ్‌షిప్ SUV ఇండియాలో లేదు.
2. పూజా బాత్రా (Pooja Batra)
టెస్లా మోడల్ 3 (Tesla Model 3):
నటి పూజా బాత్రా (Pooja Batra) టెస్లా మోడల్ 3 కారుని కలిగి ఉంది. ఈ మోడల్ కార్లు అమెరికాలో ఉన్నాయి. భారతదేశంలో ప్రారంభించబోయే మొదటి వాహనం మోడల్ 3 కావచ్చు.
Also Read: Jio 5G Test Details: 5జి టెస్ట్‌లో దూసుకుపోతున్న జియో, ఏడాది చివరికి ఇండియాలో అందుబాటులో
3. ప్రశాంత్ రుయా (Prashant Ruia)
టెస్లా మోడల్ X (Tesla Model X):
ప్రశాంత్ రుయా ఎస్సార్ క్యాపిటల్ డైరెక్టర్. అతను భారతదేశంలోని మొదటి టెస్లా యజమానులలో ఒకడు. ఇతను మోడల్ X టెస్లా కారును ఎంచుకున్నాడు. ప్రశాంత్ (Prashant Ruia)) మోడల్ X భారతదేశంలో ఉంది. ప్రశాంత్ 2017లో ఎలక్ట్రిక్ బ్లూ కలర్ మోడల్ X కారుని ఇండియాకు దిగుమతి చేసుకున్నాడు. అప్పటి నుండి అతను చాలా సార్లు ఎలక్ట్రిక్ ఎస్యూవీ (SUV)ని నడుపుతూ కనిపించాడు.
4. ముఖేష్ అంబానీ (Mukesh Ambani)
టెస్లా మోడల్ S 100D (Tesla Model S 100D):
ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ (Mukesh Ambani) గ్యారేజ్ లో రెండు టెస్లా కార్లు ఉన్నాయి. ఇందులో మెుదటిది మోడల్ S 100D. ఇది టెస్లా అందించే ఫ్లాగ్‌షిప్ సెడాన్. ప్రస్తుతం ఈ మోడల్ ను టెస్లా ఆపేసింది. పేరులోని D అంటే డ్యూయల్ మోటార్లను సూచిస్తుంది. మోడల్ S డ్రైవింగ్ పరిధి 315 మైళ్లు. ఇది 3.9 సెకన్లలో గంటకు 60 మైళ్ల వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం 250 కి.మీ.
టెస్లా మోడల్ X 100D (Tesla Model X 100D):
అంబానీకి చెందిన రెండవ టెస్లా మోడల్ X SUV. దీనిని 100డి అని కూడా అంటారు. మోడల్ X ప్రత్యేకతలలో ఒకటి దాని వెనుక తలుపులు. వీటిని ఫాల్కన్ రెక్కలు అని టెస్లా పిలుస్తుంది. ఎందుకంటే అవి గుల్వింగ్ డోర్స్ లాగా పైకి తెరుచుకుంటాయి. దీనివల్ల వాహనంలోకి వెళ్లడం, దిగడం చాలా సులభం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook