Flight ticket prices may increase as fare band policy to end soon: విమాన ప్రయాణికులకు త్వరలోనే బ్యాడ్ న్యూస్ రానుందా ? త్వరలోనే విమానాల టికెట్ బుకింగ్ చార్జీలు పెరగనున్నాయా అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. అందుకు కారణం ప్రస్తుతం ఎయిర్ లైన్స్ సంస్థలపై విధించిన Fare band policy శాశ్వతం కాదని స్వయంగా పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా చెప్పడమే. గురువారం మీడియాతో మాట్లాడిన ప్రదీప్ సింగ్ ఖరోలా.. ఎయిర్ లైన్స్ సంస్థలు పూర్తి స్థాయిలో ఆక్యుపెన్సీతో బిజినెస్ ఆపరేషన్స్ ప్రారంభించిన అనంతరం ఫ్లైట్ టికెట్ బుకింగ్‌పై ప్రస్తుతం ఉన్న ఫేర్ బ్యాండ్‌ విధానాన్ని తిరిగి ఎత్తివేయనున్నట్టు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఖరోలా మాట్లాడుతూ.. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఫ్లైట్ రైడర్‌షిప్‌ను నిశితంగా పరిశీలిస్తోందని అన్నారు. COVID-19 కి ముందుతో పోల్చుకుంటే ప్రస్తుతం 80 శాతం సామర్థ్యంతో ఎయిర్ లైన్స్ సంస్థలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని... అందులోనూ 60-65 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ ఉంటున్నట్టు ఖరోలా పేర్కొన్నారు. విమాన ప్రయాణికుల సంఖ్య సాధారణ స్థాయికి చేరుకున్న అనంతరం వెంటనే ఫేర్ బ్యాండ్స్ విధానం తొలగిపోతుందని అన్నారు.


Also read : LPG Price hiked: భారీగా పెరిగిన ఎల్పీజీ ధరలు.. ఇకపై LPG కి ఎంత Pay చేయాలంటే..


'అన్‌లాక్ మిషన్‌లో భాగంగా ఎయిర్ లైన్స్ సంస్థలు తిరిగి విమానయాన సేవలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలవడంతో విమాన ప్రయాణికులపై ఎయిర్ లైన్స్ సంస్థలు చార్జీల రూపంలో అధిక భారం మోపకుండా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విమాన ఛార్జీలను తగ్గిస్తూ ఫేర్ బ్యాండ్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. 


Also read : LIC policy holders కి గుడ్ న్యూస్.. LIC IPO లో పాలసీ హోల్డర్స్‌కి 10 % reservation


నవంబర్‌లో చివరిసారిగా ఫేర్ బ్యాండ్స్ గడువును ఫిబ్రవరి 24 వరకు పొడిగించారు. ప్రస్తుతం COVID-19 vaccine అందుబాటులోకి రావడం, విమానాల్లో రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో Fare band policy ని కేంద్రం ముగించే అవకాశాలు కూడా లేకపోలేదని పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా వ్యాఖ్యలు స్పష్టంచేస్తున్నాయి. అదే కానీ జరిగితే ఆ తర్వాత మళ్లీ Flight tickets prices పెరిగే అవకాశం కూడా లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫేర్ బ్యాండ్‌ని తొలగించినట్టయితే... Airlines సంస్థలకు మళ్లీ ఫ్లైట్ టికెట్ చార్జీలు పెంచుకునే స్వేచ్ఛ రావడమే అందుకు కారణం అవుతుంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook