Flipkart Refrigerator Offers: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌‌లో 'బిగ్ బచత్ ధమాల్ సేల్' పేరిట భారీ డిస్కౌంట్స్, ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌లో భాగంగా పలు బ్రాండ్స్‌కి చెందిన స్మార్ట్ టీవీలు, స్మార్ట్ ఫోన్లు, రిఫ్రిజిరేటర్లు, ఇతరత్రా ఎలక్ట్రానిక్ వస్తువులు అత్యంత చౌక ధరకే లభిస్తున్నాయి. రిఫ్రిజిరేటర్లలో ఎల్‌జీ, శాంసంగ్, Haier తదితర బ్రాండ్స్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. శాంసంగ్‌లో రూ.19,990 విలువ చేసే 198 లీటర్ల సింగిల్ డోర్ 4 స్టార్ రిఫ్రిజిరేటర్ (Camellia Blue) ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.4750కే అందుబాటులో ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌చేంజ్ ఆఫర్ :


శాంసంగ్ 198 లీ. డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ ఫోర్ స్టార్ రిఫ్రిజిరేటర్ (Camellia Blue) సాధారణ ధర రూ.19,990. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో 16 శాతం తగ్గింపుతో కేవలం రూ.16,750కే ఈ ఫ్రిజ్ అందుబాటులో ఉంది. ఈ ఫ్రిజ్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీ పాత ఫ్రిజ్‌ను మార్చుకున్నట్లయితే దాని కండిషన్‌ని బట్టి ఈ ఎక్స్‌చేంజ్ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ కింద రూ.12 వేల వరకు తగ్గింపు పొందవచ్చు. 


ఒకవేళ పూర్తి ఎక్స్‌చేంజ్ ఆఫర్ వర్తించినట్లయితే... రూ.16,750కి అందుబాటులో ఉన్న ఈ ఫ్రిజ్‌ను మరింత చౌకగా కేవలం రూ.4750కే పొందవచ్చు. అయితే ఎక్స్‌చేంజ్ ఆఫర్‌కి షరతులు వస్తాయని గుర్తుంచుకోండి. ఫ్లిప్‌కార్ట్‌లో ఇది లిమిటెడ్ ఆఫర్ మాత్రమే. ఇవాళ్టితో (జూన్ 5) బిగ్ బచత్ ధమాల్ సేల్ ముగియనుంది. కాబట్టి ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు,ఫ్రిజ్, ఇతరత్రా ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయాలనుకునేవారు త్వరగా ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. 


Also Read: Home Loan EMI Offers: హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేటు ఏ బ్యాంకులో ఎంత ఉంది, కావల్సిన అర్హతలేంటి


Also Read: Delhi Weather: దేశ రాజధానిలో భానుడి ప్రతాపం..ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook