Flipkart Offer: శాంసంగ్ బడ్జెట్ ఫోన్.. రూ.13 వేలు విలువ చేసే ఫోన్ కేవలం రూ.175కే... ఆఫర్ రేపే ముగింపు..
Flipkart Mobile Phone Offers: ఫ్లిప్‌కార్ట్‌లో బడ్జెట్ ఫోన్లపై `బిగ్ బచత్ ధమాల్` సేల్ కింద భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ ఆఫర్స్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
Flipkart Mobile Phone Offers: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ బచత్ ధమాల్ సేల్' కింద కస్టమర్లకు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది. మొబైల్ ఫోన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, గృహోపకరణాలను అతి చౌక ధరకే కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. రూ.50 కన్నా తక్కువ నుంచి వేల రూపాయల విలువ చేసే వస్తువులను ఈ ఆఫర్‌లో అతి చౌకగా పొందవచ్చు. ఇందులో భాగంగా బడ్జెట్ మొబైల్ ఫోన్లపై కూడా భారీ తగ్గింపు లభిస్తోంది. రూ.13 వేలు విలువ చేసే శాంసంగ్ గెలాక్సీ ఎఫ్12 (సీ గ్రీన్, 64 జీబీ) ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.11,499కే అందుబాటులో ఉంది. క్యాష్ బ్యాక్, ఎక్స్‌చేంజ్ ఆఫర్ వినియోగించుకున్నట్లయితే ఈ ఫోన్‌ని కేవలం రూ.175కే మీ సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం...
డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ ఆఫర్ :
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్12 (సీ గ్రీన్, 64 జీబీ) సాధారణ ధర రూ.12,999. కానీ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో ఈ మొబైల్ ఫోన్‌పై 11 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. అంటే... రూ.1500 మేర తగ్గింపుతో రూ.11,499కే ఈ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు, యాక్సిస్ బ్యాంక్ కార్డుతో 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ అందుబాటులో ఉంది. దీని ద్వారా మరో రూ.574 వరకు తగ్గింపు లభించినట్లే. అప్పుడు ఈ ఫోన్‌ని కేవలం రూ.10,925కే పొందవచ్చు.
ఎక్స్‌చేంజ్ ఆఫర్‌తో మరింత చౌకగా :
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్12 (సీ గ్రీన్, 64 జీబీ) ఫోన్‌పై రూ.10,750 వరకు ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీ పాత ఫోన్‌ని మార్చుకున్నట్లయితే ఈ ఎక్స్‌చేంజ్ ఆఫర్ వర్తిస్తుంది. ఎక్స్‌చేంజ్ ఆఫర్ కింద రూ.11,499 విలువ చేసే ఈ ఫోన్‌పై రూ.10,750 వరకు తగ్గింపు పొందినట్లయితే రూ.749కే ఈ టీవీని కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు, ఒకవేళ యాక్సిస్ బ్యాంక్ కార్డు ద్వారా 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా వర్తించినట్లయితే రూ.749పై మరో రూ.574 తగ్గింపు లభించినట్లే. అప్పుడు ఈ ఫోన్‌ని కేవలం రూ.175కే మీ సొంతం చేసుకోవచ్చు. అయితే క్యాష్ బ్యాక్, ఎక్స్‌చేంజ్ ఆఫర్స్‌కి షరతులు వర్తిస్తాయని గుర్తుంచుకోండి. ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బచత్ ధమాల్ సేల్‌కి రేపే ఆఖరి రోజు. ఒకవేళ మీరు చౌక ధరలో ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే వెంటనే త్వరపడండి.
Also Read: Flipkart Offer: ఫ్లిప్‌కార్ట్ ఆఫర్.. రూ.44వేల విలువ చేసే ఐఫోన్ కేవలం రూ.3725కే...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook