flipkart Big Bachat Dhamaal Sale.. ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్స్ పై అమేజింగ్ ఆఫర్స్!
flipkart Big Bachat Dhamaal Sale: ఈ-కామర్స్ సంస్థ flipkart త్వరలోనే మరో సూపర్ సేల్ నిర్వహించనుంది. Big Bachat Dhamaal పేరిట నిర్వహించనున్న ఈ సేల్ లో ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్స్ సహా ఫ్యాషన్ గార్మెంట్స్, బ్యూటీ కేర్, హోమ్ అప్లయన్సస్ పై ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ ఇవ్వనున్నట్లు flipkart వెల్లడించింది.
flipkart Big Bachat Dhamaal Sale: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ flipkart మరోసారి సూపర్ సేల్ ద్వారా ప్రత్యేక ఆఫర్లను కస్టమర్ల ముందుకు తీసుకురానుంది. Big Bachat Dhamaal పేరుతో డిసెంబరు 4 నుంచి సేల్ ప్రారంభం కానుంది. ఆ సేల్ రెండు రోజుల పాటు అంటే డిసెంబరు 6 వరకు ఫ్లిప్ కార్ట్ యాప్ లో కొనసాగనుంది.
ఈ బిగ్ బచత్ ధమాల్ సేల్ ద్వారా ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ ఫోన్స్ తో పాటు అనేక ప్రొడక్ట్ పై భారీ డిస్కౌంట్ కు లభించనుంది. ప్రస్తుతం మార్కెట్ లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన.. త్వరలోనే రానున్న ప్రొడక్ట్స్ వివరాలు ఫ్లిప్ కార్ట్ లో ఉన్నాయి.
అయితే ఈ ఇయర్ ఎండింగ్ బిగ్ సేల్ ద్వారా ఎలక్ట్రానిక్స్.. వాటి యాక్సెసరీస్ పై భారీ డిస్కౌంట్ లభించనుందని flipkart వెల్లడించింది. అందులో ఫిట్ నెస్ కు సంబంధించిన స్మార్ట్ వాచ్ లు, ఫిట్ బిట్, ఇయర్ ఫోన్స్, డెస్క్ టాప్స్, ట్రిమ్మర్స్, మొబైల్ ఫోన్ బ్యాక్ కవర్స్, మొబైల్ ఛార్జర్స్ వంటి ప్రొడక్ట్స్ రానున్న సేల్ లో తక్కువ రేటుకు లభించనున్నాయి.
ఇందులో ఫిట్ నెస్ బ్యాండ్స్, ఇయర్ ఫోన్స్, డెస్క్ టాప్, ట్రిమ్మర్లు, ఫోన్ కవర్లు, ఛార్జర్ మరియు మరిన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. వీటితో పాటు హోమ్ అప్లయన్సస్, బ్యూటీ కేర్, ఫ్యాషన్ విభాగాలకు చెందిన వస్తువులను తక్కువ ధరకు విక్రయించనున్నారు.
ఈ సేల్ లో కొన్న వస్తువులు ఉచితంగా డెలివరీ చేయబడతాయి. అదే విధంగా తక్కువ ప్రైస్ కు అందుబాటులో ఉంటాయని flipkart ఆఫర్ లో పేర్కొంది. ఈజీ రిటర్న్ పాలసీని ఈ సేల్ కు అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. అతి తక్కువ బడ్జెట్ లో దొరికే వస్తువుల కోసం ప్రత్యేక ధరలను flipkart కేటాయించింది. అందులో రూ.49 నుంచి రూ.999 ధరల మధ్యలో వస్తువులను సేల్ చేయనున్నారు.
Also Read: Gold Price Today: బంగారం ధర తగ్గుముఖం, దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు
Also Read: Smart TV Discount Offer: భలే మంచి చౌక బేరం.. అమెజాన్ లో రూ.6,999లకే స్మార్ట్ LED టీవీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook