Flipkart Big Billion Days Sale: బిగ్ బిలియన్ డేస్‌లో సగం ధరలకే శాంసంగ్ మొబైల్.. కేవలం లిమిటెడ్ ఆఫర్ మాత్రమే..
Flipkart Big Billion Days Sale: రాబోయే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో(Flipkart Big Billion Days Sale) సందర్భంగా శామ్‌సంగ్ తన ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లపై 57 శాతం వరకు తగ్గింపుతో విక్రయించనుంది. ముఖ్యంగా సామ్‌సంగ్ గ్యాలక్సీ S21 FE 5G, గ్యాలక్సీ S22+, గ్యాలక్సీ F13 వంటి ఫోన్‌లపై ప్రత్యేకమైన ఆఫర్లు ప్రకటించడం విశేషం.
Flipkart Big Billion Days Sale: రాబోయే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో(Flipkart Big Billion Days Sale) సందర్భంగా శామ్‌సంగ్ తన ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లపై 57 శాతం వరకు తగ్గింపుతో విక్రయించనుంది. ముఖ్యంగా సామ్‌సంగ్ గ్యాలక్సీ S21 FE 5G, గ్యాలక్సీ S22+, గ్యాలక్సీ F13 వంటి ఫోన్‌లపై ప్రత్యేకమైన ఆఫర్లు ప్రకటించడం విశేషం. ఈ నెల 23 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభమై..సెప్టెంబర్ 30 వరకు కొనసాగునుంది. ఈ ఆఫర్లలో భాగంగా శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్ లభించనుంది. అయితే ఇప్పటికే పలు మొబైల్స్ పై 57% వరకు తగ్గింపు చేస్తున్నట్లు ప్రకటించింది సామ్‌సంగ్ కంపెనీ. మరి కొన్ని ఆఫర్లతో కొత్త పరికరాలను వినియోగదారులకు పరిచయం చేయనుంది.
అయితే ఏ వేరియంట్ ఫోన్‌పై భారీ తగ్గింపు లభిస్తుందనే దానిపై శామ్‌సంగ్ ఇంకా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో లభించే ఆఫర్‌లను సద్వినియోగం చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. విక్రయానికి ముందు గ్యాలక్సీ S22+, గ్యాలక్సీ F23పై ఆఫర్లు మాత్రమే ప్రకటించింది శామ్‌సంగ్. అయితే గ్యాలక్సీ S21 FE 5Gపై ఆఫర్‌లు సెప్టెంబర్ 19న ప్రకటించనున్నట్లు సమాచారం.
గ్యాలక్సీ S21 FE 5G:
శామ్‌సంగ్ గ్యాలక్సీ S21 FE 5G ఫోన్ ఈ సెల్‌లో కొనుగోలు చేస్తే దాదాపు 57 శాతం తగ్గింపును పొందవచ్చు. అన్ని బ్యాంక్ ఆఫర్‌ల తర్వాత.. ఈ ఫోన్ రూ. 31,999కి అందుబాటులోకి రానుంది. ఇక ఈ ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. శామ్‌సంగ్ గ్యాలక్సీ S21 FE 5G ధర రూ. 74,999 వేలు కాగా అన్ని బ్యాంక్ ఆఫర్స్‌తో రూ. 31,999కి లభించడం విశేషం. ఈ ఫీచర్ల విషయానికొస్తే..శామ్‌సంగ్ గ్యాలక్సీ S21 FE 5G 32MP ఫ్రంట్ కెమెరాతో అందుబాటులో ఉంది.
శామ్‌సంగ్ గ్యాలక్సీ S22+:
శామ్‌సంగ్ గ్యాలక్సీ S22+ స్మార్ట్‌ఫోన్ రూ. 69,999 ధరతో మార్కెట్‌లో విక్రయిస్తోంది శామ్‌సంగ్. అయితే అన్ని ఆఫర్లు పోను మొబైల్ రూ. 59,999కి అందుబాటులో ఉంటుంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ఉన్న స్మార్ట్‌ఫోన్ రూ. 69,999 ఉండగా.. 8GB ర్మామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 88,999 ఉంది. ఇది Snapdragon 8 Gen 1 ప్రాసెసర్ పని చేయనుంది.
శామ్‌సంగ్ గ్యాలక్సీ F23 5G, Galaxy F13 రూ.10,999, రూ.8,499 ధరలకు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్‌లో లభించనున్నాయి. గ్యాలక్సీ S21 FE 5Gపై ప్రత్యేకమైన ఆఫర్ సెప్టెంబర్ 19న పెట్టనున్న ఫ్లిప్‌కార్ట్..Flipkart Plus వినియోగదారులకు సెప్టెంబర్ 22 దాకా ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read:Weight Loss: బరువు తగ్గే క్రమంలో ఈ నియమాలు పాటించండి.. కేవలం 11 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok