Flipkart Big Billion Days Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఇవాళ రాత్రి నుంచే లైవ్ స్ట్రీమింగ్ కానుంది. అయితే అందరికీ కాదు. ఎవరికి, ఏయే ఆఫర్లున్నాయో తెలుసుకుందామా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022 సెప్టెంబర్ 23 నుంచి సెప్టెంబర్ 30 వరకూ కొనసాగనుంది. అంటే రేపు రాత్రి 12 గంటల్నించి ఈ సేల్ ప్రారంభం కానుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు మాత్రం ఇవాళ రాత్రి నుంచే ఆఫర్లు, డిస్కౌంట్లు వర్తించనున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులతో భాగస్వామ్యం కారమంగా అదనంగా 10 శాతం డిస్కౌంట్ అందుతుంది. 


ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు ఇవాళ్టి నుంచే ప్రారంభం కానుంది. ఫ్యాషన్, స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్, టీవీ, ఎసీ వంటి హోమ్ అప్లయన్సెస్, స్మార్ట్ వాచెస్, వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌లపై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి. 


ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకులతో భాగస్వామ్యం కారణంగా ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ లభించనుంది. పేటీఎం కస్టమర్లకు కూడా పది శాతం డిస్కౌంట్ లభిస్తుంది. 


ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అనేది ప్లస్ సభ్యులకు ఇవాళ రాత్రి నుంచే ప్రారంభం కానుంది. మిగిలివారికి మాత్రం సెప్టెంబర్ 23 నుంచి అంటే రేపు రాత్రి నుంచి ప్రారంభమౌతుంది. ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్, యాప్‌లలో ఇప్పుడు ధరల వివరాలు అందుబాటులో ఉన్నాయి. 


ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆఫర్లు ఇలా


శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జి 31,999 రూపాయలకు లభించనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జి  కొనుగోలుపై 3 వేల రూపాయల ఎక్స్చేంజ్ డిస్కౌంట్ వర్తిస్తుంది. ఒప్పో రెనో 8 5జి 23, 749 రూపాయలకు అందుబాటులో ఉంటుంది. గూగుల్ పిక్సెల్ 6ఏ 27, 699 రూపాయలకు లభించనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22 ప్లస్ 59,999 రూపాయలకు అందుతుంది. ఐఫోన్ 13 ఊహించని ధరకు అందుబాటులో ఉండనుంది. 50 వేలలోపే ఉండవచ్చని అంచనా. ఐఫోన్ 11 30 వేలకు లభించవచ్చు. ఐఫోన్ 12 మిని 40 వేలకంటే తక్కువే ఉంటుంది. 


Also read: Excitel Broadband offers: జియో, ఎయిర్‌టెల్‌కు చెమటలు పట్టిస్తున్న ఎక్సీటెల్, తక్కువ ధరకే హైస్పీడ్ ఇంటర్నెట్, ఓటీటీ సేవలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok