Flipkart Big Saving Days 2022: ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ ప్రారంభమైంది. ఇందులో ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ అయితే ఏకంగా 20 వేలకంటే తక్కువకే లభించనుంది. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓ వైపు అమెజాన్ ఫ్రీడమ్ ఫెస్టివల్ ఆఫర్ నడుస్తుంటే మరోవైపు ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభమైంది. ఆగస్టు 6వ తేదీన ప్రారంభమైన ఈ సేల్..ఆగస్టు 10 వరకూ కొనసాగనుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌టీవీలు, స్మార్ట్‌ఫోన్లు,స ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు నడుస్తున్నాయి. ఖరీదైన స్మార్ట్‌టీవీలపై కూడా భారీ ఆఫర్లు ఉన్నాయి. 55 ఇంచెస్ స్మార్ట్‌టీవీ అతి తక్కువ ధరకే లభించనుంది.  ఇందులో Blaupunkt, Thomson, KODAK, Nokia, iFFALCON టీవీలున్నాయి. ఆ ఆఫర్ల గురించి తెలుసుకుందాం..


KODAK 7XPro Smart TV లాంచింగ్ ధర 46 వేల 999 రూపాయలు కాగా..ఫ్లిప్‌కార్ట్ లో 31 వేల 499 రూపాయలకే లభ్యం కానుంది. 32 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే మరో 2500 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. అంటే ఈ టీవీ ధర 28 వేల 999 రూపాయలైంది. ఇక ఎక్స్చేంజ్‌లో మరో 11 వేల రూపాయలు తగ్గించుకోవచ్చు. అంటే ఎక్స్చేంజ్ అనంతరం ఈ టీవీ కేవలం 17 వేల 999 రూపాయలకే లభిస్తుంది. 


ఇక Thomson OATHPRO Max Smart TV లాంచింగ్ ధర 54, 999 రూపాయలు కాగా..32 శాతం డిస్కౌంట్‌తో 36 వేల 999 రూపాయలకు కంపెనీ అందిస్తోంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారా మరో 2500 డిస్కౌంట్ లభిస్తే..34,499 రూపాయలకు లభిస్తుంది. ఇది కాకుండా 11 వేల ఎక్స్చేంజ్ ఆఫర్ మినహాయిస్తే 23 వేల 499 రూపాయలకు అందుతుంది. iFFALCON K72 Smart TV లాంచింగ్ ప్రైస్ 73,990 రూపాయలు కాగా 48 శాతం డిస్కౌంట్‌తో 37,999 రూపాయలకు లభిస్తుంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుపై మరో 2500 డిస్కౌంట్ ఉంటుంది. అంటే ఈ టీవీ ధర 35,499 రూపాయలైంది. ఇక ఎక్స్చేంజ్‌పై మరో 11 వేల రూపాయలు మినహాయిస్తే..24,499 రూపాయలకే ఈ స్మార్ట్ టీవీ కొనుగోలు చేయవచ్చు.


ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో Nokia 55 inch Smart TV లాంచింగ్ ప్రైస్ 62,999 రూపాయలు కాగా 36,999 రూపాయలకు అందుతోంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుపై 2500 డిస్కౌంట్‌తో ఈ టీవీ ధర 34,499 రూపాయలైంది. మరో 11 వేల రూపాయలు ఎక్స్చేంజ్ తగ్గుతాయి. దాంతో 63 వేల ఈ స్మార్ట్‌టీవీ కేవలం 23 వేలకే లభించనుంది. 


Also read: HDFC Interest Rates: హెచ్‌‌డిఎఫ్‌సి కస్టమర్లకు షాక్, అన్ని రుణాలపై వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook