Flipkart Mobile Offers: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో ఇటీవలే లాంచ్ అయిన మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై కూడా భారీగా డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఇదికాకుండా మీ దగ్గర యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే అదనంగా మరో 4వేలకు పైగా తగ్గింపు లభిస్తుంది. మోటో ఎడ్జ్ 50 ప్రో ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో లభించే ఆఫర్, ఇతర ఫీచర్ల గురించి తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మోటో ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.7 ఇంచెస్ కర్వ్డ్ పోల్డ్ 1.5 కే డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 2000 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంటుంది. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. అంతేకాకుండా 125 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 వాట్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. కంపెనీ నుంచి 4 ఏళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఉచితంగా అందుతాయి. ఈ ఫోన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్టెబిలైజేషన్, ఇంటెలిజెంట్ ఆటోఫోకస్ ట్రాకింగ్, అడ్వాన్స్డ్ లాంగ్ ఎక్స్‌పోజర్ వంటి ఫీచర్లు ఉంటాయి. సెక్యూరిటీ కోసం ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. యాంటీ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్లున్నాయి. 


అన్నింటికమీ మించి ఈ ఫోన్ 12 జీబీ ర్యామ్ కలిగి ఉండటంతో పనితీరు అత్యంత వేగంగా ఉంటుంది. హ్యాంగింగ్ సమస్య దాదాపుగా తలెత్తదు. 256 జీబీ స్టోరేజ్ అనేది మరో ప్రత్యేకత. ఈ హ్యాండ్‌సెట్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ప్రో గ్రేడ్ కెమేరాలున్నాయి. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, 1.3 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమేరా, 3ఎక్స్ జూమింగ్ కెపాసిటీతో 10 మెగాపిక్సెల్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి. ఇక 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా ఉంటుంది. 


మోటో ఎడ్జ్ 50 ప్రో అసలు ధర 35,999 రూపాయలు కాగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2024 లో 30,399 రూపాయలకు లభిస్తోంది. అదే మీ దగ్గర ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే అదనంగా మరో 4400 రూపాయలు తగ్గింపు లభిస్తుంది. అంటే ఈ ఫోన్ మీకు 26,599 రూపాయలకే లభిస్తుంది. 


Also read: Flipkart Big Saving Days Sale 2024: మోటో ఎడ్జ్ 40 నియో, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 ఫోన్లపై భారీ డిస్కౌంట్



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook