Flipkart Big Saving Days Sale 2024: ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమైన బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2024 మే 9 వరకూ కొనసాగనుంది. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లపై అద్బుతమైన ఊహించని ఆఫర్లు ఉన్నాయి. ముఖ్యంగా శాంసంగ్ ఎస్ 23, పోకో ఎక్స్ 6 ప్రో, నధింగ్, మోటో, ఐఫోన్ 14లపై భారీగా తగ్గింపు నడుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2024లో ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లు చాలా తక్కువ ధరకు లభిస్తున్నాయి. గూగుల్ పిక్సెల్ 7ఏ 31,999 రూపాయలు, పిక్సెల్ 8 49,999 రూపాయలకు అందుబాటులో ఉంది. ఇక ఐఫోన్ 14 అయితే ఏకంగా 55,999 రూపాయలకు, ఐఫోన్ 12 39,499 రూపాయలకు లభిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్23పై భారీ తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ ధర 74,999 రూపాయలు కాగా 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ అయితే 79,999 రూపాయలుగా ఉంది. బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 44,999 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. అంటే ఏకంగా 20 వేల డిస్కౌంట్ లబిస్తోంది. ఇక శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 ఎఫ్ఈ ధర 39,999 రూపాయలుగా ఉంది.


మోటోరోలా కంపెనీకు చెందిన మోటో ఎడ్జ్ 40 నియో ఫోన్ అసలు ధర 22,999 రూపాయలు కాగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో కేవలం 19,999 రూపాయలకు లభిస్తోంది. అదే విధంగా మోటో ఎడ్జ్ 50 ప్రో అసలు ధర 30,999 రూపాయలు కాగా బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో 27,999 రూపాయలకు లభించనుంది. ప్రస్తుతం ఈ ఫోన్‌పై 16 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. మోటో జి64 12,999 రూపాయలకు, మోటో జీ 34 అయితే 9,999 రూపాయలకు లభిస్తున్నాయి. మరో చైనా స్మార్ట్‌ఫోన్ పోకో ఎం6 7,999 రూపాయలకు, పోకో ఎక్స్ 6 అయితే 17,999 రూపాయలకు దొరుకుతోంది. అయితే వివిధ బ్రాండెడ్ ఫోన్లపై ప్రస్తుతం లభిస్తున్న ఈ ఆఫర్ మరి కొద్దిరోజులే ఉంటుంది. సమ్మర్ స్పెషల్ సేల్ మరో వారం రోజులే అందుబాటులో ఉంటుంది. 


Also read: Amazon Mobile offers: 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఫోన్ కేవలం 15 వేలకే



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook