flipkart Big Saving Days 2021: ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభమైంది. నేటి నుంచి (డిసెంబరు 16) ప్రారంభమైన ఈ సేల్ డిసెంబరు 21 వరకు కొనసాగనుంది. 6 రోజుల పాటు జరిగే ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు చాలా చౌకగా లభిస్తున్నాయి. Samsung, Apple, Xiaomi వంటి అనేక కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లు తక్కువ ధరకే సేల్‌లో అందుబాటులో ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదే సేల్ లో iPhone లపై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నారు. మీరు ఐఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే మరియు బడ్జెట్ తక్కువగా ఉంటే, అప్పుడు సేల్ మీ కోరికను నెరవేరుస్తుంది. ఐఫోన్ 12 చాలా చౌకగా కొనుగోలు చేయవచ్చు. కేవలం రూ.38 కంటే తక్కువ ధరకే Apple iPhone 12 మీ సొంతం చేసుకోవచ్చు. 


iPhone 12 భారీ ఆఫర్లు


Apple iPhone 12 వేరియంట్ లాంచ్ ధర రూ. 65,900.. కానీ విక్రయ సమయంలో ఫోన్ రూ. 54,199కి అందుబాటులో ఉంది. అంటే ఈ సేల్ ద్వారా iPhone పై 17 శాతం తగ్గింపు అంటే రూ.11,701 తక్కువగా లభిస్తోంది. దీంతో పాటు ఎక్సైంజ్ ఆఫర్ తో పాటు క్యాష్ బ్యాక్ తో అతి తక్కువ ధరకు వినియోగదారులకు అందుబాటులో ఉంది. 


బ్యాంకు ఆఫర్లు


SBI క్రెడిచ్ కార్లతో పేమెంట్ చేస్తే.. తక్షణం 10 శాతం తగ్గింపు లభించనుంది. ఈ ఆఫర్ ద్వారా రూ.1000 తగ్గింపుతో iPhone 12 రూ.53,199 లకే అందుబాటులోకి వస్తుంది. 
ఎక్సైంజ్ ఆఫర్


iPhone కొనుగోలుపై ఎక్సైంజ్ ఆఫర్ కూడా వర్తిస్తుంది. మీ పాత మొబైల్ ను మార్పిడి చేసుకోవడం ద్వారా అత్యధికంగా రూ.15,450 తగ్గింపు లభించే అవకాశం ఉంది. 
పైన పేర్కొన్న మూడు ఆఫర్లకు మీరు ఎలిజిబుల్ అయితే Apple iPhone 12 మీకు రూ.37,749 ధరకే లభిస్తోంది. ఫ్లిప్ కార్ట్ లో iPhone కొనుగోలు చేయడం వల్ల డిస్నీ + హాట్‌స్టార్‌కి ఒక సంవత్సరం సబ్‌స్క్రిప్షన్ కూడా విక్రయ సమయంలో ఫోన్‌ను కొనుగోలు చేస్తే ఉచితంగా లభించనుంది. 


Also Read: Gold Price today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు, వివిధ నగరాల్లో ఇవాళ్టి ధరలు


Also Read: Jio Rs 1 Plan: అతి చౌకైన ప్లాన్ ప్రవేశపెట్టిన జియో.. Rs.1 తో రీచార్జ్.. ఇందులో ఏం ఉండనున్నాయంటే..?  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook