Flipkart Smart TV Offers: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ సైట్‌లో స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. పలు బ్రాండ్స్‌కి చెందిన స్మార్ట్ టీవీలపై డిస్కౌంట్‌తో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులోఉంది. ఈ ఆఫర్ ద్వారా మీ ఫేవరెట్ బ్రాండ్‌కి చెందిన స్మార్ట్ టీవీని అతి చౌక ధరకే సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ 80 సెం.మీ (32 అంగుళాలు) హెచ్‌డీ ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీపై భారీ తగ్గింపుతో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకుంటే రూ.22,900 విలువ చేసే స్మార్ట్ టీవీని అతి చౌక ధరకే రూ.2849కే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ టీవీపై 30 శాతం డిస్కౌంట్ :


శాంసంగ్ 80 సెం.మీ (32 అంగుళాలు) హెచ్‌డీ ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీ లాంచింగ్ ధర రూ.22,900. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో దీనిపై 30 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అంటే.. డిస్కౌంట్ ద్వారా రూ.7 వేలు వరకు ఆదా అవుతుంది. డిస్కౌంట్ పోను రూ.15,999కే ఈ స్మార్ట్ టీవీని కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు, ఈ టీవీ కొనుగోలుకు మీరు యాక్సిస్ బ్యాంక్ కార్డు వాడినట్లయితే మరో 5 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, మరో రూ.799 వరకు ఆదా అయినట్లే. అప్పుడు ఈ స్మార్ట్ ఫోన్‌ని మరింత చౌకగగా రూ.15,200కే పొందవచ్చు.


భారీ ఎక్స్‌చేంజ్ ఆఫర్ :


శాంసంగ్ 80 సెం.మీ (32 అంగుళాలు) హెచ్‌డీ ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీపై ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. మీ పాత స్మార్ట్ టీవీని ఎక్స్‌చేంజ్ చేసుకోవడం ద్వారా ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. టీవీ కండిషన్‌ను బట్టి గరిష్ఠంగా రూ.13,150 వరకు తగ్గింపు లభిస్తుంది. ఒకవేళ పూర్తి ఆఫర్ వర్తించినట్లయితే రూ.15,999కి అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ.2849కే మీ సొంతం చేసుకోవచ్చు. అయితే డిస్కౌంట్ ఆఫర్స్, ఎక్స్‌చేంజ్ ఆఫర్‌కి షరతులు వర్తిస్తాయని గుర్తుంచుకోండి. 


Also Read: Upasana Konidela: పిల్లల్ని కనొద్దన్న సద్గురు.. ఉపాసన ఏమన్నారో తెలుసా?


Also Read: Trending Video: ధూమ్ తరహాలో రెచ్చిపోయిన ప్రేమ జంట.. క్లైమాక్స్ మామూలుగా లేదంట..!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook