Flipkart Offer on Poco M4 Pro 4G: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ తమ వినియోగదారుల కోసం అనేక ఆఫర్లను తీసుకు వస్తోంది. అనేక ఫ్లాష్ సేల్స్ తో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇక ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో  'ఎలక్ట్రానిక్ సేల్'(Electronic sale) మేళా నడుస్తోంది. ఈ సేల్ లో భాగంగా టీవీలు సహా ఫోన్లు అలాగే ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తక్కవ ధరలకే విక్రయిస్తోంది ఫ్లిప్‌కార్ట్‌. ప్రస్తుతం ఈ సేల్ లో స్మార్ట్ వాచీలు, స్మార్ట్ టీవీలు, స్మార్ట్ ఫోన్లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు తదితర వస్తువులపై భారీ డిస్కౌంట్‌ సేల్‌ నడుస్తోంది.  
 
పోకో ఎం4 ప్రోపై  33 శాతం డిస్కౌంట్: 
పోకో ఎం4 ప్రో 6 జీబీ-64 జీబీ అసలు ధర రూ. 18,999 కాగా. ఈ ఫోన్ కి ఎలక్ట్రానిక్ సేల్ (Electronic sale) భాగంగా 33 శాతం డిస్కౌంట్‌తో రూ. 11,999 అందుబాటులో ఉంది. అయితే ఈ ధరకు కొనుగోలు చేయాచ్చు. దీనిని కొటాక్  క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే.. రూ. 1,000 దాకా డిస్కౌంట్‌ లభిస్తోంది. అలా కొనుగోలు చేస్తే రూ. 10,999 లభించనుంది.
 
ఎక్స్‌చేంజ్ ఆఫర్‌: 
పోకో ఎం4 ప్రో 6 జీబీ-64 జీబీపై ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. అయితే మీ వద్ద ఉన్న ఏదైనా పాత ఫోన్ ని ఎక్స్‌చేంజ్ చేసి ఈ టీవిని కొనుగోలు చేస్తే..  దాని కండిషన్‌ని బట్టి భారీగా రూ. 11,250 దాకా తగ్గింపు లభించునుంది. అలా మీ ఫోన్ కండిషన్ ను బట్టి మీకు 11,250 ఆఫర్ వస్తే మీకు ఫోన్ కేవలం 749 రూపాయలకే లభించింది. అయితే దీనికి అన్ని రకాల ఎక్స్‌చేంజ్ ఆఫర్‌కి షరతులు వర్తిస్తాయని ఫ్లిప్‌కార్ట్‌ సూచిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫోన్ ఫీచర్లు ఇవే:
డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో కూడిన Poco M4 Pro 4G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారంగా MIUI 13లో పని చేస్తుంది. ఇక ఈ ఫోన్ 6.43-అంగుళాల పూర్తి HD + AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది, ఈ ఫోన్ 1000 Nits పీక్ బ్రైట్‌నెస్, 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో అందుబాటులో ఉంది. ఇక ఈ హ్యాండ్‌సెట్ MediaTek Helio G96 ప్రాసెసర్‌లో పనిచేస్తుంది. అలాగే 6 జీబీ నుంచి  8GB వరకు RAM కెపాసిటీ ఉంటుంది. అంతేకాక ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఇవ్వబడింది, దీని ప్రధాన లెన్స్ 64MP. ఇది కాకుండా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ సహా 2MP మాక్రో లెన్స్ కూడా ఫోన్‌లో అందుబాటులో ఉన్నాయి. ముందు భాగంలో, కంపెనీ 16MP సెల్ఫీ కెమెరాను అందించింది. అలాగే అదనపు భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇవ్వబడింది. ఇక ఈ ఫోన్ కు 5000mAh బ్యాటరీ బ్యాకప్ అలాగే 33W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లతో అందుబాటులోకి రానుంది. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook