Flipkart Big Bachat Dhamaal Sale ఇప్పుడు నడుస్తోంది. జూన్ 23న ప్రారంభమైన ఈ సేల్ జూన్ 25తో ముగిసినా ఇంకా చాలా ఉత్పత్తులపై డిస్కౌంట్లు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఐఫోన్‌పై కళ్లు చెదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రముఖ ఈ కామర్స్ వేదికలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ఎప్పటికప్పుడు ప్రత్యేక సేల్ ఆఫర్లతో వివిధ బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్స్, యాక్సెసరీస్, టీవీలపై డిస్కౌంట్లు అందిస్తుంటాయి. అదే విధంగా ఫ్లిప్‌కార్ట్ కూడా మూడ్రోజులపాటు బిగ్ బచత్ ధమాల్ సేల్ నడిపింది. ఆ సేల్ ముగిసినా ఇంకా ఆఫర్లు మాత్రం అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఆపిల్ కంపెనీకు చెందిన ఐఫోన్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు ఉన్నాయి. మీకిష్టమైన ఐఫోన్లను తక్కువ ధరకు పొందాలంటే ఇదే సరైన అవకాశం. ఐఫోన్ 12, ఐఫోన్ 13, ఐఫోన్ 14 ఫోన్లపై కూడా భారీ డిస్కౌంట్లు ఇస్తుండటంతో అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13 కేవలం 58,499 రూపాయలకే లభిస్తోంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే మరో వేయి రూపాయలు డిస్కౌంట్ పొందవచ్చు. అంటే 58, 499 రూపాయలకే ఐఫోన్ 13 సొంతం చేసుకోవచ్చు. అంటే 72 వేల ఖరీదైన ఐఫోన్ 13 కేవలం 57 వేలకే పొందవచ్చు. అది కూడా ఏ విధమైన ఎక్స్చేంజ్ ఆఫర్ లేకుండా. ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటే ఈ ధర మరింతగా తగ్గుతుంది. మీరు ఎక్స్చేంజ్ చేసే స్మార్ట్‌ఫోన్ మోడల్, కండీషన్‌ను బట్టి ఎక్స్చేంజ్ ధర ఎంత వర్తిస్తుందనేది తెలుస్తుంది. ఐఫోన్ 13 ప్రారంభ ధర ఇప్పుడు 69,900గా ఉంది. 


ఇక మరోవైపు ప్రస్తుతం నడుస్తున్న ఐఫోన్ 14 ప్రో కూడా డిస్కౌంట్ ధరకు లభిస్తోంది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో లాంచ్ అయిన ఐఫోన్ 14 ప్రో 1,29,900 రూపాయలు అసలు ధర. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ను 1,19,999 రూపాయలకు పొందవచ్చు. ఇందులోనే 128 జీబీ స్టోరేజ్ మోడల్‌పై 9,901 రూపాయలు తగ్గింపు లభిస్తోంది. ఇక క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే మరో 3 వేల రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే ఐఫోన్ 14 ప్రోను మీరు 1,16,999 రూపాయలకు పొందవచ్చు. ఐఫోన్ 14 ప్లస్ అయితే 79,999 రూపాయలకు లభిస్తోంది. ఇక ఐఫోన్ 12 స్మార్ట్‌ఫోన్ 53,999 రూపాయలకు, ఐఫోన్ 11 అయితే కేవలం 39,749 రూపాయలకు పొందవచ్చు.


ఇక ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ 128 జీబీ స్టోరేజ్ ధర 1,39,900 రూపాయలుగా ఉంటే..ఫ్లిప్‌కార్ట్‌లో 1,27,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే మరో 2 వేల రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ను మీరు 1,25,999 రూపాయలకు పొందవచ్చు. త్వరలో ప్రపంచ మార్కెట్‌లో ఐఫోన్ 15 ప్రో మోడల్ లాంచ్ కానుంది. ఎప్పుడు లాంచ్ చేసేది అధికారికంగా వెల్లడి కాకపోయినా సెప్టెంబర్‌లో లాంచ్ కావచ్చని అంచనా. 


Also read: Car Loan EMI: నో కాస్ట్ ఈఎంఐలో కారు లోన్ వస్తే ఎలా ఉంటుంది, ఇలా చేస్తా సాధ్యమే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook