Forbes India Rich List 2021: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనికుల గురించి సమాచారం అందించే మ్యాగజైన్ ఫోర్బ్స్ భారత్ కు చెందినా 2021 సంవత్సరపు ధనవంతుల జాబితా(Forbes India Rich List 2021)ను విడుదల చేసింది. ఈ జాబితాలో ముఖేష్ అంబానీ మొదటి స్థానంలో ఉన్నారు. వరుసగా 14వ సంవత్సరం కూడా భారతదేశపు ధనవంతుడిగా నిలిచారు. ముఖేష్ 2008 నుండి అత్యంత ధనవంతుల జాబితాలో ఆగ్ర స్థానంలో కొనసాగుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫోర్బ్స్ ప్రకారం, ప్రస్తుతం, ముఖేష్ అంబానీ(Mukesh Ambani) నికర విలువ 9270 మిలియన్ డాలర్లు, అంటే రూ. 6.96 లక్షల కోట్లు. అదే సమయంలో, అదానీ గ్రూప్‌కు చెందిన గౌతమ్ అదానీ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ఆయన మొత్తం ఆస్తులు $ 7480 మిలియన్లు అంటే రూ .5.61 లక్షల కోట్లు.


Also Read: మహీంద్రా ఎక్స్​యూవీ 700 సరికొత్త రికార్డు... గంటలో 25వేల బుకింగ్స్​!


భారతదేశం కుటుంబం, స్టాక్ మార్కెట్, విశ్లేషకులు, నియంత్రణ సంస్థల నుండి పొందిన వాటా.. అదేవిధంగా ఆర్థిక సమాచారం ఆధారంగా ఈ లిస్ట్ ను తయారు చేసినట్లు ఫోర్బ్స్(Forbes list) తెలిపింది. ఫ్యామిలీ ఫార్చ్యూన్ ర్యాంకింగ్‌లో లిస్ట్ చేశారు. ప్రైవేట్ కంపెనీల వాల్యుయేషన్ పబ్లిక్ ట్రేడ్ కంపెనీల ఆధారంగా జరిగింది.


Forbes India Rich List 2021-Top 5


1. ముఖేష్ అంబానీ: ఆస్తి 9270 మిలియన్ డాలర్లు, సుమారు రూ. 6.96 లక్షల కోట్లు..
ఫోర్బ్స్ ప్రకారం, 2008 నుండి, ముఖేష్ అంబానీ(Mukesh Ambani) మొదటి స్థానంలో ఉన్నారు. ఒక సంవత్సర కాలంలో, ఆయన మొత్తం ఆస్తి 400 మిలియన్ యుఎస్ డాలర్లు అంటే 30 వేల కోట్ల రూపాయలు పెరిగింది. దీంతో ఈ జాబితాలో ముఖేష్ అంబానీ మొదటి స్థానంలో ఉన్నారు, ఆయన మొత్తం ప్రస్తుత ఆస్తుల విలువ 9270 మిలియన్లు, సుమారు రూ. 6.96 లక్షల కోట్లు. ఆయన ఇటీవల ఇంధన రంగానికి సంబంధించి కొత్త ప్రణాళికను ప్రకటించారు.


2. గౌతమ్ అదానీ- మొత్తం ఆస్తి 7480 మిలియన్ డాలర్లు అంటే రూ.5.61 లక్షల కోట్లు..
వ్యాపారవేత్త గౌతమ్ అదానీ(Goutam Adani) ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్ ప్రకారం, ఆయననికర విలువ 2020 సంవత్సరంలో మూడు రెట్లు పెరిగింది. ఇది 2520 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 1.89 లక్షల కోట్లు) నుం7480 మిలియన్ల డాలర్లకు అంటే రూ .5.61 లక్షల కోట్లకు పెరిగింది.


3. శివ్ నాడార్- మొత్తం ఆస్తి 3100 మిలియన్ డాలర్లు అంటే రూ. 2.32 లక్షల కోట్లు..
దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీ హెచ్‌సిఎల్ టెక్ వ్యవస్థాపకుడు శివ నాడార్(Shiv Nadar) ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు. ఒక సంవత్సర కాలంలో, ఆయనమొత్తం ఆస్తులు 1060 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 79500 కోట్లు) నుండి 3100 మిలియన్ డాలర్లకు అంటే రూ .2.32 లక్షల కోట్లకు పెరిగాయి.


4. రాధాకృష్ణ దమాని – మొత్తం ఆస్తి 2940 మిలియన్ డాలర్లు అంటే రూ .2.20 లక్షల కోట్లు..
రాధాకృష్ణ దమాని(Radha Kirshna Damani) 22 కొత్త స్టోర్లను ప్రారంభించడానికి ప్లాన్ చేసారు. ఒక సంవత్సరంలో, మొత్తం ఆస్తి 1540 మిలియన్ డాలర్ల నుండి 2940 మిలియన్ డాలర్లకు పెరిగింది. అంటే రూ .2.20 లక్షల కోట్లు.


5. సైరస్ పూనవల్ల – మొత్తం ఆస్తి 900 మిలియన్ డాలర్లు అంటే రూ .1.42 లక్షల కోట్లు..
సైరస్ పూనవల్ల(Sirus Poonavalla) సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా యజమాని. ఇది కరోనా వ్యాక్సిన్ కోవ్‌షీల్డ్ తయారీ సంస్థ. గత ఒక సంవత్సరంలో, ఆయన మొత్తం ఆస్తి 1150 మిలియన్ యుఎస్ డాలర్ల నుండి 1900 మిలియన్ డాలర్లకు అంటే 1.42 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి