Ford Bronco Bookings: ఈ కార్ బుకింగ్‌ను రద్దు చేసుకుంటే.. రూ. 2 లక్షలు మీ సొంతం! లిమిటెడ్ ఆఫర్
Bumper Offer on Ford Bronco SUV Booking Cancellation in US. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ `ఫోర్డ్` తమ కారు బుకింగ్‌ను రద్దు చేసినందుకు గానూ రూ.2 లక్షల నగదును కొనుగోలుదారుకు చెల్లించాల్సి వచ్చింది.
Ford Offers Rs 2 Lakhs to customers on Ford Bronco SUV Booking Cancellation in US: ప్రస్తుతం భారతదేశ మార్కెట్‌లో ఎస్‌యూవీ కార్ల హవా నడుస్తోంది. ఎస్‌యూవీల డిమాండ్ దృష్ట్యా అన్ని కంపెనీలు ఈ సెగ్మెంట్‌లో పలు కార్లను తీసుకొచ్చాయి. ఎస్‌యూవీ కార్లకు పెరిగిన డిమాండ్ కారణంగా.. డెలివరీకి చాలా కాలం పడుతోంది. చాలా బుకింగ్ ఆర్డర్‌లను కలిగి ఉంటే.. కార్ల తయారీదారులు చాలా సంతోషంగా ఉంటాయి. అయితే ప్రముఖ కార్ల తయారీ కంపెనీ 'ఫోర్డ్' మాత్రం అధిక బుకింగ్ కారణంగా సతమతమవుతోంది. బుకింగ్‌ను రద్దు చేసుకుంటే.. వినియోగదారులకు డబ్బును కూడా అందిస్తోంది. ఆ వివరాలు ఓసారి చూద్దాం.
అమెరికా యొక్క ప్రముఖ ఆటోమేకర్ 'ఫోర్డ్'. కంపెనీ 2021లో బ్రోంకో ఎస్‌యూవీని లాంచ్ చేసింది. ఈ కారుకి కస్టమర్ల నుండి గొప్ప స్పందన వచ్చింది. కొనుగోలుదారుల నుంచి విపరీతమైన బుకింగ్స్ (Ford Bronco Booking) వచ్చాయి. అయితే ఉత్పత్తిలో జాప్యం కారణంగా.. ఫోర్డ్ బ్రోంకోను సమయానికి డెలివరీ చేయలేకపోయింది. అధిక బుకింగ్ కారణంగా కొనుగోలుదారుల నుంచి ఒత్తిడి కూడా పెరిగింది. వీటికి చెక్ పెట్టేందుకు ఫోర్డ్ కంపెనీ ఓ నిర్ణయం తీసుకుంది.
ఫోర్డ్ కంపెనీ బ్రోంకో ఎస్‌యూవీ బుకింగ్‌ను రద్దు చేసి.. మరో మోడల్‌ను బుక్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఇలా చేస్తే $2,500 (భారత కరెన్సీలో సుమారు రూ. 2 లక్షలు) తగ్గింపును అందిస్తోంది. మీడియా నివేదికల ప్రకారం.. అమెరికాలో 2023 ఏప్రిల్ 3లోపు బుకింగ్ చేసుకునే ఇతర వాహనాలపై మాత్రమే ఈ తగ్గింపు అందుబాటులో ఉంటుంది. విసుగు చెందిన కొందరు కొనుగోలుదారుల మరో వాహనాన్ని బుక్ చేసుకుంటున్నారట.
బ్రోంకో ఎస్‌యూవీలోని కొన్ని వేరియంట్లలో హై-ఎండ్ ఫీచర్లు ఇవ్వబడ్డాయి. వీటిలో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, 10-స్పీకర్ B&O సౌండ్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ నావిగేషన్ మరియు బాడీ-కలర్ హార్డ్‌టాప్‌లు ఉన్నాయి. ఈ కారు 4X4 సౌకర్యంతో కూడా వస్తుంది. లుకింగ్ కూడా చాలా బాగుంది. దాంతో ఫోర్డ్ బ్రోంకో కోసం వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది. అయితే కంపెనీ తాజా బుకింగ్ గణాంకాలు మరియు పెండింగ్ ఆర్డర్‌ల వివరాలు మాత్రం తెలియరాలేదు. అమెరికాలో 2 లక్షల మందికి పైగా ఈ కారుని బుక్ చేసుకున్నారని సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.