Google: ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్‌పై భారీ జరిమానా విధించారు. ఆ సంస్థపై వచ్చిన ఆరోపణలు రుజువైనందున ఫ్రాన్స్ గూగుల్ సంస్థపై పెద్దఎత్తున జరిమానా విధించింది. వ్యాపార విధానంలో మార్పులకు అంగీకరించింది. వివరాలిలా ఉన్నాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్ సంస్థపై ఆన్‌లైన్ అడ్వర్టైజింగ్ ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలు వచ్చాయి. పోటీ సంస్థల్ని దెబ్బతీసే తరహా విధానాన్ని కంపెనీ పాటించిందనేది ఆ ఆరోపణ. ఈ ఆరోపణల్ని ఫ్రాన్స్ గుత్తాధిపత్య నియంత్రణ(Google)సంస్థ కాంపిటిషన్ అథారిటీ నిర్ధారించింది. జరిమానా విధిస్తూ..గూగుల్ తన విధానాల్ని మార్చుకుంటే పోటీదారులందరికీ సమాన అవకాశలు లభిస్తాయని కాంపిటిషన్ అథారిటీ తెలిపింది. వివాదాన్నిసెటిల్ చేసుకునేందుకు గూగుల్ సంస్థ అంగీకరించిందని తెలిసింది. రూపర్ట్ మర్డోక్‌కు చెందిన న్యూస్‌కార్బ్, ఫ్రాన్స్ ( France) పేపర్ గ్రూప్ లె ఫిగాగో, బెల్జియంకు చందిన రోసెల్ లా వాయిస్ వంటి సంస్థలు గూగుల్‌పై ఆరోపణలు చేశాయి.


ఈ ఆరోపణలపై విచారణ చేసిన అధారిటీ భారీగా ఫైన్ విధించింది. గూగుల్ సంస్ధపై 220 మిలియన్ యూరోల జరిమానాను( 220 million uros fine) విధించగా..గూగుల్ సంస్థ అందుకు అంగీకరించింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా తన వ్యాపార విధానాన్ని మార్చుకునేందుకు సమ్మతించింది. 


Also read: Galaxy S21 Mobiles: రూ.10,000 Cashback ప్రకటించిన స్మార్ట్‌ఫోన్ దిగ్గజం Samsung


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook