Bajaj Cng Bike: ప్రపంచంలోనే మొట్టమొదటి CNG స్కూటర్‌ లాంచ్‌ కాబోతోంది. ఈ బైక్‌ను భారత ఆటో మొబైల్‌ కంపెనీ బజాజ్ విడుదల చేయబోతోంది. దీనిని జూలై 5న పూణేలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే లాంచింగ్ కంటే ముందే ఈ స్మార్ట్‌ బైక్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ లీక్‌ అయ్యాయి. అంతేకాకుండా కంపెనీ తాజా ఈ మోటర్‌ సైకిల్‌లో ఉండే పెట్రోల్‌ టూ సీఎన్‌జీకి మారే స్పెషల్‌ బటన్‌ గురించి కూడా రివీల్‌ చేసింది. ఈ సింగిల్ బటన్‌ ద్వారా CNG మోడ్‌ నుంచి ఏకంగా పెట్రోల్‌ మోడ్‌కి వెళ్తుంది. అంతేకాకుండా ఇది మార్కెట్‌లో లాంచ్‌ అయితే దేశంలోనే అత్యధిక మైలేజీనిచ్చే బైక్‌గా నిలుస్తుంది. అలాగే ఈ CNG బైక్‌కి సంబంధించిన బైక్స్‌కి ఫోటోస్‌ కూడా లీక్‌ అయ్యాయి.      


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బజాజ్ సిఎన్‌జి బైక్‌ freedom 125 పేరుతో లాంచ్‌ కాబోతోంది. అంతేకాకుండా ఇది  ఎంతో శక్తివంతమైన 125 సిసి ఇంజన్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. కానీ ఇంజన్‌ శక్తి పరంగా చూస్తే పెట్రోల్‌ బైక్‌ల ఇంజన్‌ కంటే చాలా తక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని మార్కెట్‌లో టాక్‌. మరికొంతమంది ఆటో నిపుణులైతే ఇది దాదాపు 100cc కమ్యూటర్ బైక్‌తో సమానంగా ఉంటుందని చెబుతున్నారు. దీని మైలేజీ విషయానికొస్తే, ఇది లీటర్‌కు 90 లేదా 100 కిమీ వరకు మైలేజీని ఇస్తుంది. ఇక కేజీ CNGకి ఎంత మైలేజీని ఇస్తుందని కంపెనీ వెల్లడించలేదు. ఈ బైక్‌ను కంపెనీ మొత్తం రెండు కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. 


బజాజ్ CNG బైక్‌ దాదాపు 5 లీటర్స్‌ సామర్థ్యం కలిగిన చిన్న పెట్రోల్‌ ట్యాక్‌ సెటప్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది 4 నుంచి 5 కిలోల పెద్ద CNG ట్యాంక్‌ కూడా అందుబాటులో ఉంది. ఇది చూడడానికి ఎంతో ఆకర్శనీయంగా ఉంటుంది. అలాగే ప్రత్యేకమైన కలర్‌ వేరియంట్స్‌లో రాబోతోంది. రెండు కలర్స్‌కు సిల్వర్ కలర్ యాక్సెసరీలు కలిగి ఉంటుంది. దీంతో పాటు ముందు భాగంలో రౌండ్ హెడ్‌లైట్‌ సెటప్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


ఫీచర్స్‌, స్పెఫికేషన్స్‌:
హ్యాండిల్ బార్ బ్రేస్‌లు
స్టైలిష్ బెల్లీ పాన్
5-స్పోక్ అల్లాయ్ వీల్స్
రిబ్బెడ్ సీట్
లియన్ కోసం బలమైన గ్రాబ్ రైల్
టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్
నకిల్ గార్డ్
ఫ్రంట్ డిస్క్ బ్రేక్ 
గ్రౌండ్ క్లియరెన్స్ 
అడ్వెంచర్ స్టైల్‌
రియర్ మోనో-షాక్ సెటప్
టైర్ హగ్గర్ 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి