Fuel Prices Today: ఆగిన పెట్రో బాదుడు.. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ రేట్లు ఇలా..
Fuel Prices Today: దేశంలో పెట్రోల్ ధరల మోతకు కొద్దిగా బ్రేక్ పడింది. వరుసగా ఐదో రోజుల పాటు రోజుకు 35 పైసల చొప్పున పెరిగిన క్రమంలో సోమవారం వాటి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని ప్రాంతాల్లో సోమవారం పెట్రోల్, డీజిల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి.
Fuel Prices Today: దేశంలో ఐదు రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ పోయిన ముడి చమురు సంస్థలు.. సోమవారం (Fuel Prices Today) కాస్త విరామాన్నిచ్చాయి. గత ఐదు రోజుల నుంచి రోజుకు సగటున 35 పైసలు పెంచగా.. సోమవారం వాటి ధరల్లో ఎలాంటి పెంపు చేయలేదు. అయితే ఇప్పటికే దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్‌టైమ్‌హైకి (Fuel Prices Across India) చేరుకున్నాయి. ఈ క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాల్లో..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర (Petrol price in Hyderabad) రూ.111.87 ఉండగా.. డీజిల్ ధర (Diesel Price in Hyderabad) రూ.105.04 వద్ద నిలిచింది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్య నగరాలైన విశాఖపట్నం, విజయవాడల్లో ముడి చమురు ధరలు ఇలా ఉన్నాయి. వైజాగ్‌లో లీటర్ పెట్రోల్ (Petrol price in Vizag) రూ.112.62 వద్ద నిలవగా.. డీజిల్ ధర (Diesel price in Vizag) రూ.105.23 వద్ద ఉంది.
మరోవైపు విజయవాడలో లీటరు పెట్రోలు (Petrol price in Vijayawada) రూ.113.93 వద్ద, డీజిల్ ధర (Diesel price in Vijayawada) రూ.106.50 ఉన్నాయి.
ఇతర ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ (Petrol price in Delhi), డీజిల్ ధరలు (Diesel Price in Delhi) వరుసగా.. రూ.107.59, రూ.96.33 వద్ద ఉన్నాయి.
బెంగళూరులో పెట్రోల్ ధర (Petrol Price in Bangalore) లీటర్ రూ.111.3 వద్ద కొనసాగుతోంది. లీటర్ డీజిల్ ధర (Diesel Price in Bengaluru) రూ.102.2 వద్ద నిలిచింది.
చెన్నైలో పెట్రోల్ ధర (Petrol Price in Chennai) లీటర్ రూ.104.49 వద్ద ఉంది. లీటర్ డీజిల్ ధర (Diesel Price in Chennai) రూ.100.55 వద్ద నిలిచింది.
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రోల్ ధర (Petrol Price in Mumbai)రూ.113.42 వద్ద.. లీటర్ డీజిల్ ధర (Diesel Price in Mumbai) రూ.104.34 వద్ద ఉన్నాయి.
కోల్‌కతాలో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దీనితో లీటర్ పెట్రోల్ (Petrol Price in Kolkata) రూ.108.7గా ఉంది. డీజిల్ ధర లీటర్ రూ.99.4 వద్ద కొనసాగుతోంది.
రాజస్థాన్‌లోని గంగానగర్‌లో పెట్రోల్ ధర లీటర్ రూ.119.69 వద్ద ఉంది. డీజిల్ ధర రూ.110.55 వద్ద కొనసాగుతోంది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్న ప్రాంతం ఇదే.
Also Read: వరుసగా ఐదో రోజు పెట్రోల్ ధర మోత.. హైదరాబాద్‌లో రూ.105లకు పెరిగిన డీజిల్ ధర
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook.