Ratan Tata: టాటా గ్రూప్ దేశంలోనే అతిపెద్ద కార్పోరేట్ గ్రూప్. ఈ కంపెనీల విలువ దాదాపు 400 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుంది.  టాటా గ్రూప్‌లో దాదాపు 100 కంపెనీలు ఉన్నాయి, వాటిలో 26 కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ అయి ఉన్నాయి. టాటా గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మంది కంటే  కంటే ఎక్కువ మంది ఉద్యోగులను కలిగి ఉంది. టాటా గ్రూప్ ఉత్పత్తులు ప్రపంచంలోని దాదాపు 150 దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. టాటా గ్రూప్ 1868లో ట్రేడింగ్ కంపెనీగా ప్రారంభమైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాటా గ్రూప్ 150 సంవత్సరాలు చరిత్రలో అత్యంత సక్సెస్ సాధించిన చైర్మన్ లలో రతన్ టాటా ఒకరుగా చెప్పవచ్చు. ఆయన ఆధ్వర్యంలో టాటా గ్రూప్ కంపెనీలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగాయి. అయితే టాటా గ్రూప్ టాటా కుటుంబ సభ్యులకు సంబంధించినది. అయితే టాటా కుటుంబ సభ్యులకు చాటా గ్రూప్ చైర్మన్ పదవి వారసత్వంగా రాదు అన్న సంగతి గుర్తించాలి. రతన్ టాటా సైతం ఒక సాధారణ ఉద్యోగి స్థాయి నుంచి తన ప్రస్థానం ప్రారంభించి అంచలంచలుగా ఎదిగి టాటా గ్రూప్ చైర్మన్ గా ఎదిగారు. నిజానికి రతన్ టాటా తండ్రి టాటా కుటుంబానికి దత్తత రూపంలో వచ్చారు. అందుకే రతన్ టాటా కుటుంబ సభ్యుల రక్తం కాదని కొంతమంది వాదిస్తుంటారు. ఇందులో నిజా నిజాలు ఏంటో తెలుసుకుందాం. 


టాటా గ్రూప్ కుటుంబ వృక్షాన్ని పరిశీలిస్తే, ఈ కుటుంబంలో చాలా మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఉన్నారు. టాటా కుటుంబానికి పునాది రతన్ దొరబ్ టాటా నుండి వచ్చింది. వారికి ఇద్దరు పిల్లలు. బాయి నవాజ్‌బాయి రతన్ టాటా, నుస్సర్వాన్‌జీ రతన్ టాటా. నుస్సర్వాన్జీ ఒక పార్సీ పూజారి. వ్యాపారంలోకి అడుగుపెట్టిన మొదటి వ్యక్తి. అతని జీవిత కాలం 1822 నుండి 1886 వరకు ఉన్నారు. .


జమ్‌షెడ్జీ టాటా:


నుస్సర్వాన్‌జీ టాటాకు 5 మంది పిల్లలు ఉన్నారు. వారిలో ప్రముఖ వ్యాపారవేత్త జమ్‌సెట్‌జీ టాటా ఒకరు. అతను టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు. అతను టాటా గ్రూప్‌లోని స్టీల్, హోటళ్లు  వంటి ప్రధాన వ్యాపారాలకు పునాది వేశారు. ఆయనను భారతీయ కార్పోరేట్ వ్యాపార పరిశ్రమ పితామహుడిగా పిలుస్తారు.  1839 నుండి 1904 వరకు జీవించి ఉన్నారు. 


దొరాబ్జీ టాటా:


దొరాబ్జీ టాటా జమ్‌షెడ్జీ  టాటా పెద్ద కుమారుడు. జమ్‌షెడ్జీ  తర్వాత టాటా గ్రూప్ వ్యాపారాన్ని ఆయనే చేపట్టారు. అతని జీవిత కాలం 1859 నుంచి 1932వరకు. టాటా పవర్ వంటి వ్యాపారాలను స్థాపించడంలో దొరాబ్జీ కీలక పాత్ర పోషించారు.


రతన్ జీ టాటా:


రతన్‌జీ టాటా జమ్‌షెడ్జీ  టాటా చిన్న కుమారుడు. అతని జీవితకాలం 1871 నుండి 1918 వరకు విస్తరించింది. అతను టాటా గ్రూప్‌లో  వస్త్ర పరిశ్రమ వంటి వ్యాపారాలను జోడించారు. 


JRD టాటా:


అతని పూర్తి పేరు జహంగీర్ రతన్ జీ దాదాభాయ్ టాటా. అతని జీవితకాలం 1904 నుంచి 1993 మధ్య ఉంది. అతను రతన్‌జీ టాటా, సుజానే బ్రియర్‌ల కుమారుడు. 50 ఏళ్లకు పైగా టాటా గ్రూప్‌ ఛైర్మన్‌గా ఉన్నారు. టాటా ఎయిర్‌లైన్స్‌ (ఆ తర్వాత ఇండియన్ ఎయిర్ లైన్స్ గా మారింది) దీన్ని జెఆర్‌డి టాటా స్థాపించారు. దశబ్దాల పాటు ప్రభుత్వ యాజమాన్య సంస్థగా ఉన్న ఈ విమానయాన సంస్థ తిరిగి తన మాతృసంస్థ టాటా గ్రూపులో చేరింది. 


నావల్ టాటా:


ఈయన రతన్ టాటా తండ్రి. నావల్ టాటా జీవిత కాలం 1904 నుంచి 1989 మధ్య ఉంది. అతను రతన్‌జీ టాటా దత్తపుత్రుడు. రతన్ నావల్ టాటా, నోయెల్ టాటా అతని వారసులు. 


రతన్ టాటా:


రతన్ టాటా జీవిత కాలం 1937 నుండి 2024. అతను నావల్ టాటా మరియు సునీ కమిషరియట్ కుమారుడు. రతన్ టాటా అక్టోబర్ 9, 2024న మరణించారు. రతన్ టాటా JLR, Tetley, Corus వంటి కొనుగోళ్లను చేసారు. రతన్ టాటా ఎప్పటికీ భారతదేశపు ప్రముఖ పారిశ్రామికవేత్తగా పేరుపొందారు.


రతన్ టాటా.. టాటాల రక్తం కాదా..? 


రతన్ టాటా తండ్రి నావల్ టాటా ఒక అనాథ. ఆయనను జంషెడ్ జీ టాటా చిన్న కుమారుడు రతన్ జి టాటా దతత తీసుకొని పెంచారు. అలా దత్తత ద్వారా దాటా కుటుంబంలోకి వచ్చిన నావల్ టాటా కుమారుడే రతన్ టాటా. అయితే నావెల్ టాటా తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణించడంతో ఆయన అనాధ అయ్యాడు. కానీ నావల్ టాటా కూడా టాటా కుటుంబానికి చెందిన దూరపు బంధువు అని అతని తండ్రి హోరమ్జీ టాటా అని చెబుతారు. ఆ విధంగా చూసిన రతన్ టాటా, టాటాల కుటుంబ రక్తమే అని చరిత్రకారులు చెప్తున్నారు. అయితే టాటా గ్రూపు చైర్మన్ గా ఎదగడం వెనుక రతన్ టాటాకు టాటాల వారసత్వం పనికి రాలేదు. ఆయన ఒక సాధారణ ఇంటర్న్ ఉద్యోగి స్థాయి నుంచి అంచలంచలుగా ఎదిగి.. వివాహం సైతం త్యాగం చేసి టాటా గ్రూపు కు చైర్మన్ అయ్యారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి