Asia's Richest Person: అదానీ గ్రూప్​ సంస్థల అధినేత గౌతమ్ అదానీ మరో ఘనతను సాధించారు. దేశంలోనే కాకుండా ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా అవతరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటి వరకు ఆసియాలో అత్యంత సంపన్నుడిగా ఉన్న రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్​ అంబానీని వెనక్కి నెట్టి ఈ రికార్డును సొంత చేసుకున్నారు గౌతమ్ అదానీ.


ఎవరి సంపద ఎంతంటే..


బ్లూమ్​బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్​ ప్రకారం.. సోమవారం నాటికి గౌతమ్ అదానీ మొత్తం సంపద విలువ 88.5 బిలియన్ డాలర్ల (రూ.6.6 లక్షల కోట్లకు పైమాటే)కు పెరిగింది.


ఇదే సమయంలో ముకేశ్ అంబానీ సంపద విలువ రూ.87.9 బిలియన్​ డాలర్లు (రూ.6.2 లక్షల కోట్ల పైమాటే) గా ఉంది.


మరో విశేషమేమిటంటే.. ప్రపంచవ్యాప్తంగా 2022లో ఇప్పటి వరకు అత్యధికంగా సంపద పెరిగిన వ్యక్తి కూడా గౌతమ్​ అదానీనే అని బ్లూమ్​బర్గ్​ పేర్కొంది. ఈ ఏడాది ఇప్పటి వరకు అదానీ సంపద 12 బిలియన్ డాలర్లు (రూ.89 వేల కోట్లకన్నా ఎక్కువే) పెరిగింది.


అదానీ వ్యాపారాలు ఇవే..


అదానీ వ్యాపారాలు గుజరాత్​లోని అహ్మదాబాద్ కేంద్రంగా పని చేస్తాయి. అదానీ వ్యాపారాల్లో ముఖ్యమైనవి పోర్ట్స్​, విద్యుత్​, మైనింగ్​, పునరుత్పాదక విద్యుత్​, ఎయిర్​పోర్ట్​ ఆపరేషన్స్​, ఆయిల్​ అండ్ గ్యాస్​, ఫుడప్​ ప్రాసెసింగ్​, మౌలిక సదుపాయాలు.


అంబానీ వ్యాపారాలు..


రిలయన్స్ ఇండస్ట్రీస్​ లిమిటెడ్ పేరుతో అదానీ వ్యాపారాలు నడుస్తాయి. ముంబయి కేంద్రంగా ఈ గ్రూప్ కార్యకలాపాలు సాగుతుంటాయి.


రిలయన్స్ గ్రూప్​లో పెట్రోలియం, సహజవాయు, పెట్రో కెమిమికల్స్​, టెలికాం, టెక్స్​టైల్స్​, రిటైల్​, మీడియా, టెలివిజన్​ ఎంటర్​టైన్మెంట్​, ఫినాన్షియల్ సర్వీసులు ముఖ్యమైన వ్యాపారాలు.


Also read: iPhone 13 Price Drops: రూ.74,900 విలువైన ఐఫోన్ 13ను రూ.52,305కే కొనండిలా!


Also read: Jio Free Services: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. ఆ రెండు రోజులు అన్ని సర్వీసులు ఉచితం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook