Post Office Schemes: పోస్టాఫీస్ జనాలకు ఎన్నో లాభదాయకమైన పథకాలను అందిస్తుంది. పోస్టాఫీస్ లో ఇన్వెస్ట్ చేసే డబ్బులు ఎలాంటి రిస్క్ లేకుండా మంచి లాభాలను పొందవచ్చు. ఇతర ఇన్వెస్ట్ మెంట్ లతో పోలిస్తే పోస్టాఫీస్ వంటి ఎలాంటి రిస్క్ ఉండదు. బ్యాంకుల్లో అయితే రూ.5 లక్షల వరకే హామీ.. కానీ పోస్టాఫీసుల్లో అలా ఉండదు. పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్న స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో ఏంటంటే.. రికరింగ్ డిపాజిట్‌ చిన్న మొత్తంలో పెట్టుబడికి ఇదొక మంచి స్కీం అని చెప్పవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సంవత్సరం సెప్టెంబర్ 29న సెంట్రల్ గవర్నెమెంట్ చిన్న మొత్తంలో చేసే పొదుపు పథకాలపై వడ్డీరేట్లలో మార్పులు తీసుకొచ్చింది. రికరింగ్ డిపాజిట్‌ స్కీంలో చిన్న పొత్తంలో పెట్టుబడి పెట్టె వారికి శుభవార్తే అని చెప్పాలి. పోస్టాఫీసులో రికరింగ్ డిపాజిట్‌లపై పెట్టుబడి పెట్టె వారికి వర్తించే వడ్డీ రేటను 20 బేసిస్‌ పాయింట్లు 6.5 %  నుండి 6.7 శాతానికి పెంచింది. అక్టోబర్‌ నెల నుండి డిసెంబర్‌ నెల 2023 మధ్యలో పెట్టుబడి పెట్టె వారికి ఈ కొత్త రేట్లు వర్తించనున్నాయి.  రికరింగ్ డిపాజిట్‌లపై 5 ఏళ్లపాటు పెట్టుబడులు పెట్టేవారు ఎక్కువ వడ్డీని పొందొచ్చు. 


రికరింగ్ డిపాజిట్‌ స్కీం లో పెట్టుబడులు 100 రూపాయల నుండి కూడా పెట్టవచ్చు. ఈ స్కీం ఆర్‌డీ మెచ్యూరిటీ కాలం 5 ఏళ్లుగా ఉంటుంది. ఒకవేళ డిపాజిట్ స్టార్ట్ అయినా తరువాత ఒక సంవత్సరం పాటు యాక్టివ్ గా ఉంటే.. డిపాజిట్ చేసిన మొత్తంలో 50% ను రుణంగా కూడా పొందవచ్చు. 


Also Read: Winter immunity: చలికాలం తరచూ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇది మీ కోసమే..


ఈ స్కీం పూర్తిగా అర్థం కావాలంటే.. ఉదాహరణకు ఒక 5 రూపాయలు రికరింగ్ డిపాజిట్‌ స్కీంపై డిపాజిట్ చేస్తే..  మెచ్యూరిటీ కాలం ముగిసే సరికి దీని విలువ 3 లక్షల రూపాయలు అవుతుంది. అంతేకాకుండా దీనిపై 6.7 శాతం వడ్డీ.. అంటే అదనంగా రూ. 56,830 మీకు లభిస్తాయి. అంటే పూర్తిగా.. ఈ స్కీం ఫండ్‌ రూ. 3,56,830 పొందవచ్చు. ఒకవేళ మెచ్యూరిటీ కాలం తరువాత మీకు డబ్బు అవసరం లేకుండా మరో ఐదేళ్లు పొడిగిస్తే.. మీకు వచ్చే అమౌంట్ రెండింతలు అవుతుంది. 


చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టే వారికి ఇదొక మంచి అవకాశం అని చెప్పాలి. వీటి వలన మీకు ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయి. ఇవి మాత్రమే కాకుండా.. చాలా మంచి స్కీంలు పోస్టాఫీసులో  అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీకు ఆసక్తి ఉంటే ఒకసారి పోస్టాఫీసు సందర్శిస్తే.. మీకు కావలసిన అన్ని రకాల సమాచారం పొందవచ్చు.


Also Read: India-Canada Conflict: కెనడాకు వీసా సేవల్ని పునరుద్ఱరించిన ఇండియా, ఆ 4 కేటగరీలకే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..