Gold Price Today: బంగారం ప్రియులకు భారీ షాక్.. రూ. 50 వేల మార్క్ దాటేసిన పసిడి ధరలు!
Today Gold Rate 22 December 2022, Gold and Silver Price increased on 22nd December 2022: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 50,100 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,650గా ఉంది.
Gold and Silver Price increased on 22nd December 2022: బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజలుగా పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెరిగిన పసిడి ధరలు ఇటీవలి రోజుల్లో హెచ్చుతగులు అవుతున్నాయి. నేడు బంగారం ధరలు రూ. 50 వేల మార్క్ దాటేసి పరుగులు పెడుతోంది. గురువారం (డిసెంబర్ 22) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ. 50,100లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,650లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 500.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 540 పెరిగింది. ఈ ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం 6 గంటలకు నమోదైనవి.
# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,250 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,820గా ఉంది.
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 50,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,650గా నమోదైంది.
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 51,180గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 55,830 వద్ద కొనసాగుతోంది.
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 50,150గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,700గా ఉంది.
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,650గా ఉంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 50,100 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,650గా ఉంది.
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50,100.. 24 క్యారెట్ల ధర రూ. 54,650గా నమోదైంది.
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 50,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,650 వద్ద కొనసాగుతోంది.
మరోవైపు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. గురువారం (డిసెంబర్ 22) దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 70,100లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 800 పెరిగింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 70,100లుగా ఉండగా.. చెన్నైలో రూ. 74,700లుగా ఉంది. బెంగళూరులో రూ. 74,700గా ఉండగా.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 74,700లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 74,700ల వద్ద కొనసాగుతోంది.
Also Read: Wednesday Shopping Tips: బుధవారం షాపింగ్‌కి వెళుతున్నారా.. ఈ వస్తువులను మాత్రం అస్సలు కొనొద్దు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.