Gold Rate Today:  నేడు ఆగస్టు 10, 2024 శనివారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అయితే గత నాలుగు రోజుల్లో బంగారం ధరలు భారీగా తగ్గుముకం పడుతున్నాయి. అంతేకాదు దేశంలోని ఇతర నగరాల్లో కూడా బంగారం ధర తగ్గడతో పాటు వెండి ధర కూడా తగ్గుతోంది. అయితే, ఈ రోజు హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం ధర ఎంతో తెలుసుకుందాం.  కాగా ప్రస్తుతం శనివారం హైదరాబాద్ నగరంలో 24 క్యారెట్ల బంగారం ధర - రూ. 70,090, పది గ్రాముల బంగారం ధర - రూ. 64,250గా పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విజయవాడ, వైజాగ్, తిరుపతిలో  24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 70,150 గా ఉంది. అదే సమయంలో 22 క్యారట్ల బంగారం ధర రూ. 64,250గా ఉంది. ఇక దేశ రాజధాని న్యూఢిల్లీలో శుక్రవారం బంగారం ధర రూ.64,400గా ఉంది. దీంతో దాదాపు అన్ని చోట్ల ధరలు పెరిగాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర బడ్జెట్ తర్వాత శ్రావణ మాసంలో బంగారం, వెండి ధరలు తగ్గుతాయని అంతా ఆశించారు. అయితే అందుకు తగ్గట్లుగానే బంగారం ధరలు భారీగా తగ్గి ఇఫ్పుడు మళ్లీ ధర స్వల్పంగా పెరిగింది. బడ్జెట్‌లో బంగారం, వెండి, ప్లాటినంపై కస్టమ్స్‌ సుంకాన్ని తగ్గించడంతో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఇప్పుడు పెళ్లిళ్లలాంటి శుభకార్యాలు పెరిగిపోయి ఎక్కువ మంది మహిళలు నగల ప్రియులే కావడం, ఈ నేపథ్యంలో బంగారం ధర పెరిగి నగల వ్యాపారం జోరుగా సాగుతోంది.


Also Read: SIP :  నెలకు రూ. 5000వేలు కడితే చాలు..కోటి రూపాయలు మీ సొంతం..ఎలాగో తెలుసా? 


నేటి వెండి ధర:


ఇక దేశంలో వెండి ధర పెరిగింది. భారతదేశంలో వెండి ధరలు అంతర్జాతీయ వ్యత్యాసాలు, డాలర్‌తో రూపాయి విలువపై ఆధారపడి ఉంటాయి. రూపాయి విలువ పెరగడం, తగ్గడం వల్ల బంగారం, వెండి ధరలు కూడా మారుతూ ఉంటాయి. నేడు కేజీ బంగారం ధర రూ.88,000గా ఉంది. 


 ఇక అంతర్జాతీయంగా చూసినట్టయితే బంగారం ధరలు నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నాయి గతంతో పోల్చి చూసినట్లయితే బంగారం ధరలు భారీగా తగ్గాయి.  అయినప్పటికీ ప్రస్తుతం అమెరికాలో ఒక ఔన్స్ ( సుమారు 31 గ్రాముల)  బంగారం ధర 2400 డాలర్ల కన్నా ఉంది.  దీంతో బంగారం ధరలు దేశీయంగా కూడా తగ్గుతూ వస్తున్నాయి.  అయితే దేశీయంగా  దిగుమతి సుంకం తగ్గిన నేపథ్యంలో భవిష్యత్తులో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని కూడా నిపుణులు భావిస్తున్నారు.


Also Read: PAN Card Number :  పాన్ కార్డు నెంబర్ మార్చుకోవడం సాధ్యం అవుతుందా? రూల్స్ ఏం చెబుతున్నాయి..?


 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter