Gold Price in Hyderabad :  శ్రావణమాసం వేలా విశేషం బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నెల ప్రారంభం నుంచి భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు, గడచిన రెండు రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. ఆగస్టు 7వ తేదీన బంగారం ధర ఏకంగా 1000 రూపాయల వరకు తగ్గింది. ప్రస్తుతం బంగారం ధర ఆగస్టు 8 గురువారం తేదీ, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 69,700 వద్ద స్వల్పంగా తగ్గింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63,900 వద్ద స్థిరపడింది. బంగారం ధర గడచిన 48 గంటల్లోనే 1100 రూపాయలు తగ్గి పసిడి ప్రియులకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే దేశీయంగా పన్ను సుంకాలను తగ్గించడంతో బంగారం ధరలు గత నెల చివరిలోనే భారీగా తగ్గుముఖం పట్టాయి. గరిష్ట స్థాయి అయినా 75 వేల రూపాయల నుంచి బంగారం ధరలు 67 వేల రూపాయలకు పతనం అయ్యాయి. అయితే అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు మళ్ళీ 10 గ్రాములకు గాను 4వేల రూపాయలు పెరిగింది. అయితే గడచిన 48 గంటల్లో బంగారం ధర 1100 రూపాయలు తగ్గింది.


బంగారం ధరలు భారీగా తగ్గడం వెనక అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిస్థితులే కారణంగా చెబుతున్నారు. దేశీయంగా పన్ను సుంకాలు తగ్గించడంతోపాటు అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో దేశీయంగా ఉన్నటువంటి డిమాండ్ ఆధారంగా బంగారం ధరలు ఇక్కడ భారీగా తగ్గాయి.


Also Read : Gold Storie: శ్రావణమాసంలో బంగారం కొంటున్నారా?అయితే ఈ ఒక్క విషయం మర్చిపోతే లక్షల్లో నష్టం తప్పదు..!


మరోవైపు శ్రావణమాసం పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో పసిడి ధరలు తగ్గుముఖం పట్టడంతో పసిడి ప్రియుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. అయితే శ్రావణమాసంలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఆ తర్వాత వరుసగా పండుగలు కూడా ఉన్నాయి. దీంతో ఆభరణాలు డిమాండ్ భారీగా ఉండే అవకాశం ఉంటుంది. దీపావళి వరకు నగల షాపింగ్ జోరు తగ్గదని ఆభరణాల యాజమాన్య సంస్థలు తెలుపుతున్నాయి.


Also Read : Business Ideas: ఇల్లు కదలకుండా కేవలం రోజుకు 2 గంటలు కష్టపడితే చాలు...నెలకు రూ. 50 వేలు పక్కా..!!


 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter