Gold News: ఇదేంట్రా బాబోయ్ మరో రికార్డు కొట్టేసిన బంగారం ధర.. ఇక నగలు కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే..?
Gold Rate: దీపావళి ముంగిట బంగారం ధరలు పసిడి బిరుదుల గుండెల్లో బాంబుల్లా పేలుతున్నాయి. బంగారం ధర నేడు రికార్డును సృష్టించింది. తగ్గినట్టే తగ్గి బంగారం ధర ఒక్కసారిగా ఒకే రోజులో దాదాపు 700 రూపాయలు పెరిగింది. దీంతో పసిడి ప్రియులంతా ఆందోళనకు గురవుతున్నారు.
Gold Rate: తులం బంగారం లక్ష అవ్వడం ఖాయమని మరికొందరు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 30వ తేదీ బుధవారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. నేడు 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 81,550 పలుకుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 74,550 ఉంది. బంగారం ధరలు వరుసగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఎవరైతే ఆభరణాలు కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో వారి జేబు భారం మరింత పెరుగుతుంది.
పసిడి ధరలు ఇంత వేగంగా పెరగడం చరిత్రలో దాదాపు ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. దీనికి ప్రధానంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు అని ఒక కారణంగా చెబుతున్నారు. బంగారం ధరలు వరుసగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ధర వద్ద బంగారం కొనుగోలు చేయాలా వద్దా అని చాలామంది ఆలోచిస్తుంటారు. అయితే బంగారం ధర త్వరలోనే ఒక లక్ష రూపాయలు అయ్యే అవకాశం కూడా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఎందుకు ప్రధానంగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లలో అనిశ్చితి నెలకొని ఉంది. ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధంతో పాటు, అమెరికాలో ఆర్థిక పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. దీంతో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున తమ పెట్టుబడులను బంగారం వైపు తరలిస్తున్నారు. పసిడి ప్రియులు ఇలా తమ పెట్టుబడులను బంగారం వైపు తరలించడానికి ప్రధాన కారణం బంగారాన్ని ఒక సేఫ్ పెట్టుబడిగా భావిస్తూ ఉంటారు.
Also Read: Schools Closed: దీపావళి సెలవులు స్కూళ్లకు ఎన్నిరోజులు వచ్చాయి తెలుసా? విద్యాశాఖ కీలక ఆదేశాలు..!
దీనికి తోడు బంగారం పై పెట్టుబడి పెట్టేందుకు అటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు సెంట్రల్ బ్యాంకులు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా చైనా సెంట్రల్ బ్యాంక్ పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తుంది. బంగారం ధరలు పెరగడానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పవచ్చు.
ఇక బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో బంగారు ఆభరణాలు కొనుగోలు విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇకపై ఒక మిల్లీగ్రామ్ తేడా వచ్చినా మీరు పెద్ద మొత్తంలో డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. దీని దృష్టిలో ఉంచుకొని ఇకపై బంగారం కొనుగోలు చేయాలి. బంగారం నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ పడకూడదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.