Todays Gold Rate: రష్యా ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం బంగారం ధరలపై పడుతోంది. గత కొద్దికాలంగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగారం ధరలు ప్రతిరోజూ ఎప్పటికప్పుడు మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, డాలర్ విలువ, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితుల కారణంగా ఎప్పటికప్పుడు మారుతుంటుంది బంగారం ధర. ఈసారి రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా గత కొద్దిరోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ఇప్పుడు తగ్గుతోంది. 


దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 750 రూపాయలు కాగా, 24 క్యారెట్ల ధర బంగారం పది గ్రాముల ధర 52 వేల 100 రూపాయలుంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 47 వేల 930 రూపాయలైతే..24 క్యారెట్ల బంగారం ధర 52 వేల 290 రూపాయలుంది. అటు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 750 రూపాయలుంది. 24 క్యారెట్ల బంగారం ధర 52 వేల 100 రూపాయలుంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 750 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 52 వేల 100 రూపాయలుంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 750 రూపాయలుంది. ఇక 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 52 వేల 100 రూపాయలుగా ఉంది. 


ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 47 వేల 750 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 52 వేల 100 రూపాయలుంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 47 వేల 750 కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 52 వేల 100 రూపాయలుంది. 


Also read: Fedex CEO: మరో దిగ్గజ సంస్థకు భారతీయుడి నాయకత్వం- ఫెడ్​ఎక్స్​ సీఈఓగా రాజ్​ సుబ్రమణియం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook