Gold Price Hike, 24 Carat Gold Price in Hyderabad is RS 61800: భారత దేశంలో బంగారం, వెండి ధరలు రోజురోజుకి పెరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా గత ఆరు నెలలుగా పసిడి ధరలకు రెక్కలు వచ్చాయి. గతేడాది నవంబర్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దాదాపుగా రూ. 46,800లుగా ఉండగా.. ఇప్పుడు ఏకంగా  రూ. 56, 650లుగా ఉంది. అంటే దాదాపుగా రూ. 10 వేల రూపాయలు పెరిగింది. ఆగస్ట్ 2020 రికార్డు ధర కంటే పసిడి ధర ప్రస్తుతం ఎక్కువగా ఉంది. బంగారం బాటలోనే వెండి కూడా నడుస్తోంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 79,600లుగా ఉంది. రానున్న కాలంలో బంగారం, వెండి ధరలు మరింత పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుక్రవారం (2023 ఏప్రిల్ 14) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర (Gold Price Hike Today 2023) దేశీయ మార్కెట్లో రూ. 56,650లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,800లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 550.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 600 పెరిగింది. ఈ బంగారం ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం 6 గంటలకు నమోదైనవి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్సుకు 2018.30 డాలర్లు పలుకుతోంది. ఇది కొద్ది రోజుల క్రితం 1800 డాలర్లుగా ఉంది. ఇప్పుడు ఆల్ టైమ్ హై దిశగా వెళుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి రూ.82.010 వద్ద ట్రేడవుతోంది.


వెండి ధర మళ్లీ ఆల్ టైమ్ హైకి చేరింది. ఈరోజు రూ. 1600 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి రేటు దేశీయ మార్కెట్లో రూ. 79,600లుగా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి రేటు రూ. 73,000లుగా ఉండగా.. ఢిల్లీలో రూ. 79,600 పలుకుతోంది. చెన్నైలో 83 వేలు, ముంబైలో 79 వేల 600 ఉంది. ఢిల్లీలో బంగారం ధర, హైదరాబాద్‌లో వెండి రేట్లు కాస్త ఎక్కువగా ఉంటాయి. ట్యాక్సుల కారణంగా ఈ మార్పులు ఉంటాయి. 


# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,800 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 61,950గా ఉంది. 
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 56,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 61,800గా నమోదైంది. 
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,300గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 62,500 వద్ద కొనసాగుతోంది. 
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 56,700లుగా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ. 61,850గా ఉంది. 
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 61,800గా ఉంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 56,650 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 61,800గా ఉంది. 
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,650.. 24 క్యారెట్ల ధర రూ. 61,800గా నమోదైంది. 
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 56,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది. 


Also Read: Tata Nexon 2023: ఈ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ఎస్‌యూవీ ఉండగా.. మారుతీ బ్రెజాను ఎందుకు కొనుగోలు చేయాలి!  


Also Read: Ketu Gochar 2023: కేతు సంచారం 2023.. ఈ రాశుల వారికి అడుగడుగునా విజయమే! డబ్బు సంచులు పక్కా  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.