Gold Price Today: బంగారం ప్రియులకు శుభవార్త.. వరుసగా రెండో రోజూ తగ్గిన పసిడి ధరలు!
Gold and Silver Prices dropped on 17 December 2022 in Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 49,700 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,220గా ఉంది.
Gold and Silver Price dropped on 17th December 2022: గత కొన్ని రోజలుగా బంగారం ధరలు పెరుగుతూ వచ్చిన విషయం తెలిసిందే. పెరిగిన పసిడి ధరలు ఇటీవలి రోజుల్లో పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. అయితే వరుసగా రెండో రోజు బంగారం ధరలు తగ్గాయి. శనివారం (డిసెంబర్ 17) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ. 49,700లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,220లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 290.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 310 తగ్గింది. ఈ బంగారం ధరలు దేశీయ మార్కెట్లో ఈరోజు ఉదయం 6 గంటలకు నమోదైనవి.
# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,850 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,380గా ఉంది.
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 49,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,220గా నమోదైంది.
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50,450గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 55,040 వద్ద కొనసాగుతోంది.
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 49,750గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,280గా ఉంది.
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,790 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,220గా ఉంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 49,700 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,220గా ఉంది.
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,700.. 24 క్యారెట్ల ధర రూ. 54,220గా నమోదైంది.
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 49,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,220 వద్ద కొనసాగుతోంది.
మరోవైపు బంగారం బాటలోనే వెండి కూడా నడిచింది. శనివారం (డిసెంబర్ 17) దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 69,500లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 1000 తగ్గింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 69,500లుగా ఉండగా.. చెన్నైలో రూ. 72,500లుగా ఉంది. బెంగళూరులో రూ. 72,500గా ఉండగా.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 72,500లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 72,500ల వద్ద కొనసాగుతోంది.
Also Read: Horoscope Today 17 December 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రెండు రాశుల ప్రేమికులు విజయాలు సాధిస్తారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.