Gold Price Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్... తగ్గిన బంగారం ధరలు... ఎంత తగ్గిందంటే..
Gold Price Today April 21 2022 : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్... బంగారం ధర స్వల్పంగా దిగి వచ్చింది... అక్షయ తృతీయ సమీపిస్తున్న తరుణంలో బంగారం ధరలు దిగిరావడం పసిడి ప్రియులకు నిజంగానే శుభవార్త అని చెప్పాలి.
Gold Price Today April 21 2022 : బంగారమంటే భారతీయులకు ఒక సెంటిమెంట్. ఇంట్లో ఏ శుభ కార్యమైనా ఎంతో కొంత బంగారం కొనుగోలు చేస్తుంటారు. బంగారం ధర ఏమాత్రం తగ్గినా... వెంటనే కొద్ది మొత్తంలోనైనా బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. మరికొద్ది రోజుల్లో అక్షయ తృతీయ రానున్న నేపథ్యంలో పసిడి ప్రియులకు ఇది శుభవార్త లాంటిదే. దేశీయ మార్కెట్‌లో బంగారం ధర స్వల్పం తగ్గింది. నేటి బంగారం ధరల వివరాలు ఇక్కడ తెలుసుకోండి...
తగ్గిన పసిడి ధర :
ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,150 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,620గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.700, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.760 మేర దిగి వచ్చింది. కిలో వెండిపై రూ.1700 మేర తగ్గి ప్రస్తుతం రూ.68,300 ధర ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు:
హైదరాబాద్ మార్కెట్‌లో ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,150గా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,620గా ఉంది.
ఏపీలోని విజయవాడలోనూ హైదరాబాద్ మార్కెట్‌లోని ధరలే కొనసాగుతున్నాయి. ఇవాళ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,150 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,620గా ఉంది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీ సహా ఇతర నగరాల్లో బంగారం ధరలు:
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,150 ఉండగా, అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,620గా ఉంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.49,150
ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,620గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,630 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,140గా ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,620గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,620గా ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,620గా ఉంది.
Also Read: Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ తదుపరి టార్గెట్ కర్ణాటకే, ఇవాళ కీలక సమావేశం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook