Gold Price Today: దీపావళి ముంగిట బంగారం ధర రికార్డు స్థాయిలో పెరుగుదల కనిపిస్తోంది. అంతర్జాతీయంగా పసిడి ధరలు పెరగడంతో రికార్డు స్థాయికి చేరుకుంది. యుఎస్ డాలర్ బలహీనత, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, చైనాలో వడ్డీ రేటు తగ్గింపుల మధ్య ప్రారంభ ట్రేడ్‌లో బంగారం రికార్డు గరిష్ట స్థాయి రూ.81,000ను తాకింది. అక్టోబర్ 25న ప్రారంభ ట్రేడింగ్‌లో బంగారం ధర పెరిగి 10 గ్రాములకు రూ.81,150కి చేరుకుంది. వెండి ధర కిలోకు రూ.1,01,230కి చేరుకుంది. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,010 పలుకుతోంది


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు మునుపటి  కంటే ఎక్కువ పెరిగి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. బలహీనమైన US డేటా వడ్డీ రేట్లను మరింత తగ్గించే అవకాశం గురించి ఆందోళన వ్యక్తం అవుతోంది. దీంతో వెండి సైతం నాలుగు నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. బంగారం మునుపటి రికార్డు గరిష్ట స్థాయిని అధిగమించి ఔన్స్ 2,765 డాలర్ల పైన చేరుకుంది.


బంగారం ధర ఎందుకు పెరుగుతోంది ?


బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి, మొదటి సారిగా రూ. 81,000 పైన కనిపించింది. పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతోపాటు బలహీనమైన యూఎస్ డేటా, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ మరింత వడ్డీరేటు తగ్గించడం బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారకాలుగా నిలుస్తున్నాయి.


Also Read: Supreme court: ఆధార్‌ కార్డుపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. వయస్సు ధృవీకరణకు చెల్లదని స్పష్టం..  


ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల పెరుగుదల కనిపిస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. అనేక దేశాల కేంద్ర బ్యాంకులు తమ నిల్వల్లో బంగారం నిల్వలను పెంచుకోవడం ఇందుకు ఒక కారణంగా చెబుతున్నారు. ఇందులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ చైనా ఉన్నాయి. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా వరుసగా 17 నెలలుగా బంగారం కొనుగోలు చేస్తోంది. ఇది కాకుండా, రాబోయే కాలంలో అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతాయనే భయం కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు.


రాబోయే రోజుల్లో బంగారం ధర మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.  మరికొన్ని రోజుల్లో 10 గ్రాముల బంగారం రూ.85 వేల వరకు పలికే అవకాశం ఉంది. అటు వెండి ధరలు కూడా  భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంది. బంగారం ధర పెరగడం వల్ల కొనుగోలుదారులు కలత చెందుతున్నారు, అయితే వారు బంగారంపై పెట్టుబడిని కూడా సురక్షితంగా భావిస్తారు. అందుకే షాపింగ్ కూడా పెరుగుతోంది. దీనికి తోడు ధన త్రయోదశి, దీపావళి డిమాండ్ కూడా బంగారం ధరను పెంచుతోంది.


Also Read: Agori Escaped From Accident: అఘోరీకి తప్పిన ప్రమాదం.. కారు టైర్‌ బ్లాస్ట్‌, కేథార్‌నాథ్‌ వెళ్తుండగా ఏం జరిగిందంటే?  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter