Gold Price Today 9 September 2022: బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటుచేసుకుంటాయన్న విషయం తెలిసిందే. ఓ రోజు పసిడి ధర పెరిగితే మరోరోజు తగ్గుతుంది.. ఇంకో రోజు మాత్రం స్థిరంగా ఉంటుంది. కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో పసిడి నిల్వ, డాలర్ విలువ, పలు దేశాల భౌతిక పరిస్థితులు లాంటి పరిణామాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. అయితే పసిడికి భారత మహిళలు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి.. బంగారం ధరలు ఎంత పెరిగినా లేదా తగ్గినా వ్యాపారాలు మాత్రం జోరుగానే సాగుతాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత 3-4 రోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి ధర.. నేడు కూడా భారీగానే పెరిగింది. శుక్రవారం (సెప్టెంబర్ 9) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ. 46,650లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,890లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల తులం బంగారంపై రూ. 250.. 24 క్యారెట్ల ధరపై రూ. 270 పెరిగింది. దేశంలోని ప్రధాన పట్టణాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. 


# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,800 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,040గా ఉంది. 
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 46,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 50,890గా నమోదైంది. 
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,300గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,600 వద్ద కొనసాగుతోంది. 
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,700గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ. 50,950గా ఉంది. 
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 50,890గా ఉంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,650 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,890గా ఉంది. 
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,650.. 24 క్యారెట్ల ధర రూ. 50,890గా నమోదైంది. 
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 46,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 50,890 వద్ద కొనసాగుతోంది. 


బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ. 54,200లుగా కొనసాగుతోంది. నిన్నటితో పోల్చుకుంటే వెండి ధర ఏకంగా రూ. 1400 పెరిగింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 54,200లుగా ఉండగా.. చెన్నైలో రూ. 59,500లుగా ఉంది. బెంగళూరులో రూ. 59,500గా ఉండగా.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 59,500లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 59,500ల వద్ద కొనసాగుతోంది. 


Also Read: Queen Elizabeth 2: బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ 2 కన్నుమూత.. ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం..  


Also Read: Horoscope Today September 9th 2022: నేటి రాశి ఫలాలు... ఈ రాశి వారికి తమ సహనాన్ని పరీక్షించే పరిస్థితులు ఎదురవుతాయి..  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook