Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. ఎట్టకేలకు తగ్గిన బంగారం ధర.. ఎంత తగ్గిందో తెలుసా..
వరుసగా మూడు రోజుల పాటు పెరిగిన బంగారం ధర ఎట్టకేలకు ఇవాళ దిగొచ్చింది. గత మూడు రోజుల్లో రూ.750 మేర పెరిగిన ధర ఇవాళ ఒక్కరోజే రూ.380 మేర తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.350 మేర, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.380 మేర ధర తగ్గింది. దీంతో బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,600కి చేరింది. హైదరాబాద్ సహా దేశంలోని వివిధ నగరాల్లో నేటి బంగారం ధరలను ఇప్పుడు పరిశీలిద్దాం...
Gold Price Today August 28th 2022 : వరుసగా మూడు రోజుల పాటు పెరిగిన బంగారం ధర ఎట్టకేలకు ఇవాళ దిగొచ్చింది. గత మూడు రోజుల్లో రూ.750 మేర పెరిగిన ధర ఇవాళ ఒక్కరోజే రూ.380 మేర తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.350 మేర, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.380 మేర ధర తగ్గింది. దీంతో బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,600కి చేరింది. హైదరాబాద్ సహా దేశంలోని వివిధ నగరాల్లో నేటి బంగారం ధరలను ఇప్పుడు పరిశీలిద్దాం...
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు:
ప్రస్తుతంహైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,600గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,450గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,760గా ఉంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,600గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,050గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,420గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,350గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,650గా ఉంది.
మహారాష్ట్రలోని పుణే, గుజరాత్‌లోని వడోదరా నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,330 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,630గా ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,600గా ఉంది.
గడిచిన మూడు రోజుల్లో బంగారం ధర వరుసగా రూ.320, రూ.270, రూ.160 మేర పెరిగింది. గడిచిన 10 రోజుల్లో ఈ 3 రోజుల్లోనే బంగారం ధర పెరిగింది. మిగతా ఏడు రోజుల్లో నాలుగు రోజులు బంగారం తగ్గింది. మరో రెండు రోజుల పాటు స్థిరంగా కొనసాగింది.
పెరిగినట్లయింది. గురు, శుక్రవారాల్లో రూ.320, రూ.270 మేర పెరిగిన ధర ఇవాళ రూ.160 మేర పెరిగింది. మొత్తంగా గడిచిన 10 రోజుల్లో బంగారం ధర నాలుగు సార్లు తగ్గి 3 సార్లు పెరిగింది. ప్రస్తుతం కొనసాగుతున్న బంగారం ధరలపై జీఎస్టీ, టీసీఎస్, ఇతరత్రా పన్నుల కారణంగా వివిధ నగరాల్లోని ధరలు స్వల్ప తేడాలు ఉండొచ్చు. కచ్చితమైన ధర తెలుసుకోవాలనుకునేవారు నేరుగా స్థానిక జ్యువెలరీ వ్యాపారులను సంప్రదించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, డాలరుతో రూపాయి మారకం విలువ, దేశాల మధ్య సంబంధాలు తదితర అంశాల ప్రభావంతో బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటుంటాయి.
Also Read: Horoscope Today August 28th 2022: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి