Gold Price Today September 3rd 2022 : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధర వరుసగా మూడో రోజు కూడా దిగొచ్చింది. గురు, శుక్రవారాల్లో రూ.270, రూ.540 మేర తగ్గిన ధర ఇవాళ రూ.110 మేర తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.110 మేర ధర తగ్గింది. ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,400, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,620గా ఉంది. హైదరాబాద్, విజయవాడ  సహా దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలను ఇప్పుడు పరిశీలిద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు:


తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో ఒకే ధరలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ మూడు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,400, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,620గా ఉంది.


దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:


దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,550గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,780గా ఉంది.


దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,620గా ఉంది.


చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,950గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,220గా ఉంది.


బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,450గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,670గా ఉంది.


మహారాష్ట్రలోని పుణే, గుజరాత్‌లోని వడోదరా నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,430 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,650గా ఉంది. 


కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,400గా ఉంది. 24  క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,620గా ఉంది.


గడిచిన 10 రోజుల్లో బంగారం ధర రూ.1470 మేర తగ్గింది. ఇందులో గడిచిన 3 రోజుల్లోనే రూ.920 మేర ధర తగ్గడం గమనార్హం. ఇక ఇదే పీరియడ్‌లో బంగారం ధర రూ.860 మేర పెరిగింది. పెరిగిన దానితో పోలిస్తే తగ్గిన ధరే ఎక్కువగా ఉంది. రాబోయే రోజుల్లో ధరలు మరింత తగ్గుముఖం  పట్టవచ్చుననే అంచనాలు ఉన్నాయి. సాధారణంగా బంగారం ధరలపై జీఎస్టీ, టీసీఎస్, ఇతరత్రా పన్నుల కారణంగా వివిధ నగరాల్లోని ధరల్లో కొంత తేడాలు ఉంటాయి. కస్టమర్స్ కచ్చితమైన ధర కోసం నేరుగా స్థానిక జ్యువెలరీ వ్యాపారులను సంప్రదించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, డాలరుతో రూపాయి మారకం విలువ, దేశాల మధ్య సంబంధాలు తదితర అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తుంటాయి.  


Also Read: KTR slams FM Nirmala Sitharaman: నడి రోడ్డుపై జిల్లా కలెక్టర్‌తో వ్యవహరించే తీరిదేనా


Also Read: Horoscope Today September 3rd 2022: నేటి రాశి ఫలాలు... ఈ రాశి వారికి ఇవాళ ఎప్పటికీ గుర్తుండిపోయే కొన్ని సంఘటనలు ఎదురవుతాయి..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712



మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook