Todays Gold Price: బంగారం ధరలు గణనీయంగా తగ్గుతున్నాయి. మొన్నటి వరకూ పెరిగిన బంగారం ధర ఇప్పుడు క్షీణిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగారం, వెండి రెండింటి ధరలు దిగివస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, డాలర్ విలువ, కరోనా మహమ్మారి, వివిధ దేశాల మధ్య పరిణామాలు అన్నీ బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి. అందుకే బంగారం ధర రోజురోజుకీ మారుతుంటోంది. గత కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర మొన్నటి నుంచి తగ్గుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ బంగారం, వెండి ధరల్ని ఓసారి పరిశీలిద్దాం.


దేశ రాజధాని ఢిల్లీలో(Delhi Gold Rate) 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 100 రూపాయలుగా ఉంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల100 రూపాయలుగా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేలుగా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల రూపాయలుంటే..24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేలుగా ఉంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేలుంటే..24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 100 రూపాయలుంది. 


ఇక హైదరాబాద్‌లో (Hyderabad Gold Price) 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 100 రూపాయలుంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 150 రూపాయలుగా ఉంది. ఇక విశాఖపట్నంలో కూడా అదే ధర కొనసాగుతోంది. 


ఇక వెండి ధరలు (Silver Price) ఇలా ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నగరాల్లో కిలో వెండి 61 వేల 100 రూపాయలు కాగా, చెన్నై, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో కిలో వెండి 65 వేల 5 వందల రూపాయలుగా ఉంది. కేరళలో కిలో వెండి 63 వేల 3 వందల రూపాయలుంది. 


Also read: Flipkart Electronics Sale: రూ.18,990 విలువ గల ఒప్పొ ఏ53ఎస్​ 5జీ ఫోన్ కేవలం రూ.540కే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook