Todays Gold Rate: బంగారం మరోసారి పరుగులు పెడుతోంది. బంగారం ధర రోజురోజుకూ పెరుగుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, డాలర్ విలువ, ద్రవ్యోల్బణం, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు, కరోనా మహమ్మారి..ఇలా చాలా అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుంటాయి. అందుకే బంగారం ధర రోజురోజుకూ మారుతుంటుంది. గత పది రోజుల్లో బంగారం ధర ఐదుసార్లు పెరగగా..రెండుసార్లు మాత్రమే తగ్గింది. 2-3 సార్లు స్థిరంగా ఉంది. ఇవాళ వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.


దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం (Gold Rate) పది గ్రాముల ధర 47 వేల 7 వందల రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర అత్యధికంగా 52 వేల 40 రూపాయలుంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 47 వేల 8 వందలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 50 వేల 5 వందలుగా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 45 వేల 550 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేల 7 వందలుగా ఉంది.చెన్నైలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 45 వేల 810 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 50 వేలకు చేరింది. ఇక దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 47 వేల 590 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేల 590 రూపాయలుగా ఉంది. 


ఇక తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో (Hyderabad Gold Price) 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 45 వేల 550 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేల 7 వందల రూపాయలుగా ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. 


Also read; PPF Investment: నెలకు రూ.5 వేలే.. రూ.16 లక్షలు పొందవచ్చు.. ఎలాగో తెలుసుకోండి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook