Gold Price Today: దేశంలో బంగారం ధరలు షాకిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న పసిడి ధరలు ఇవాళ మరోసారి పెరిగాయి. తులం బంగారంపై రూ.250 నుంచి రూ.280 వరకు పెరిగింది. కిలో వెండి అయితే రూ.600 పైగా పెరిగింది.  హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.62,000 ఉంటే... ముంబైలో రూ.57,000గా ఉంది. ఈ ధరలు బులియన్ మార్కెట్లో ఉదయం ఆరు గంటలకు నమోదైనవి. దేశంలోని ప్రధాన నగరాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు (Gold Price Today) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలోని ప్రధాన నగరాల్లో..
>> దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,900 వద్ద కొనసాగుతోంది. 
>> దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000గా ఉంది. 
>> పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000 ఉంది.
>> కర్ణాటకలోని బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950 వద్ద కొనసాగుతోంది.
>> కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,900 వద్ద ఉంది.


తెలుగు రాష్ట్రాల్లో..
>>  హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,900 వద్ద కొనసాగుతోంది.
>> విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,900 ఉంది.
>>  చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.46,970 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,240 వద్ద ఉంది.


Also Read: Gold and Silver Beliefs: బంగారం, వెండితో జనం నమ్మకాలు, బంగారం పోగొట్టుకుంటే ఏం జరుగుతుంది 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook