Todays Gold Rate: బంగారం ధర ఇవాళ కాస్త స్థిరంగా ఉంది. గత కొద్దిరోజులుగా బంగారం ధర పెరుగుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బులియన్ మార్కెట్‌లో బంగారం ధర ఎప్పటికప్పుడు మారుతుంటోంది. గత కొద్దిరోజులుగా పెరుగుతున్న బంగారం దర ఇవాళ కాస్త స్థిరంగా ఉంది. అంతర్జాతీయంగా బంగారం డిమాండ్, ద్రవ్యోల్బణం, కరోనా మహమ్మారి, డాలర్ విలువ, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు వంటివి బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుంటాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఇవాళ్టి బంగారం ధరల్ని పరిశీలిద్దాం.


దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 8 వందలు కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 49 వేల 970 రూపాయలుగా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 8 వందలైతే..24 క్యారెట్ల బంగారం ధర 49 వేల 970 రూపాయలుగా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 46 వేల 10 రూపాయలు కాగా, ,24 క్యారెట్ల బంగారం ధర 50 వేల 2 వందలుగా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 45 వేల 800 కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేల 7 వందల రూపాయలుంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర 45 వేల 8 వందలైతే..24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49వేల 970 రూపాయలుంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 45 వేల 8 వందలుండగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేల 970 రూపాయలుగా ఉంది. 


ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర ఇలా ఉంది. హైదరాబాద్‌లో(Hyderabad Gold Rate) 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 8 వందలైతే.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 970 రూపాయలుగా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 45 వేల 8 వందలుండగా,24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేల 970 రూపాయలుగా ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 45 వేల 8 వందలుండగా, 24 క్యారెట్ల ధర 49 వేల 970 రూపాయలుంది.


Also read: Monthly Pension Increase: గుడ్‌ న్యూస్ చెప్పనున్న ఈపీఎఫ్‌ఓ.. త్వరలో పెరగనున్న నెలవారీ పెన్షన్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook