INVESTING IN GOLD VS STOCKS:గడిచిన 10 ఏండ్లుగా గమనించినట్లయితే.. స్టాక్ మార్కెట్లో అద్భుతమైన రిటర్న్స్ అందిస్తున్నాయి. నిఫ్టీ సెన్సెక్స్ కూడా రికార్డు స్థాయిలో కదులుతున్నాయి అయితే ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయం అని నిపుణులు సూచిస్తున్నారు.మీ ఆదాయంలో కొంత భాగం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే భవిష్యత్తులో మంచి మొత్తంలో డబ్బు సంపాదించవచ్చని స్టాక్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.కానీ అదే సమయంలో గడిచిన 10 ఏండ్లు వెనక్కు చూసినట్లయితే.. బంగారం ధర కూడా భారీగా పెరిగింది. 2014 నుంచి 2024 వరకు లెక్క వేసుకుంటే..బంగారం ధర దాదాపు మూడింతలు అయింది. ఈ నేపథ్యంలో చాలామంది బంగారం పైన పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. అయితే మీ దగ్గర ఉన్న సంపదను స్టాక్ మార్కెట్లో పెడితే ఎక్కువ లాభం వస్తుందా? లేక బంగారంలో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభం వస్తుందా ?అని తెలియక తికమక పడుతున్నారా ?అయితే ఎందులో పెట్టుబడి పెడితే రాబడి అధికంగా వస్తుందో.. ఎందులో పెట్టుబడి పెడితే మీ డబ్బు సురక్షితంగా ఉంటుందో.. ఇప్పుడు మనం తెలుసుకుందాం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత పదేళ్లలో స్టాక్ మార్కెట్ పెర్ఫర్మాన్స్ ఇదే:


స్టాక్ మార్కెట్లు గడిచిన 10 సంవత్సరాల్లో అద్భుతమైన రాబడిని అందించాయి.ముఖ్యంగా నిఫ్టీ సెన్సెక్స్ గడచిన పది సంవత్సరాల్లో దాదాపు 200 శాతం పెరిగాయి.నిఫ్టీ సూచి లోని సుమారు 14 స్టాక్స్ అద్భుతమైన రాబడిని అందించాయి. గడచిన పది సంవత్సరాల్లో గమనిస్తే బజాజ్ గ్రూప్ కి చెందిన బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్ గత దశాబ్ద కాలంలో ఏకంగా 3900 శాతం వరకు రాబడిని అందించాయి. ఇక అలాగే టాటా గ్రూపుకు చెందిన టైటాన్ కంపెనీ 1300 శాతం రాబడిని అందించింది 1000% పైగా రిటర్న్స్ అందించింది. గడచిన దశాబ్ద కాలంలో 800 శాతం వరకు లాభాన్ని అందించాయి. అలాగే టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ 700% రాబడి అందించగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా 500% వరకు రాబడిని అందించాయి.


Also Read: Pan Card Correction Process: పాన్ కార్డులో మీ పేరు కరెక్షన్ చేయాలా ?ఆన్‌లైన్ ద్వారా ఎలా మార్చాలో తెలుసుకోండి.!!


గత పదేళ్లలో బంగారం మార్కెట్ పెర్ఫ్మార్మన్స్ ఇదే:


ఇక బంగారం విషయానికొస్తే, బంగారం కూడా గడచిన పది సంవత్సరాల్లో పెద్ద ఎత్తున రిటర్న్స్ అందించాయి. 2014 సంవత్సరంలో బంగారం 10 గ్రాముల ధర 28వేల రూపాయలు ఉండగా ప్రస్తుతం బంగారం ధర రూ. 75 వేల సమీపంలో ఉంది. అంటే సుమారు మూడు రెట్లు పెరిగింది అని అర్థం ఈ లెక్కన చూస్తే బంగారం కూడా స్టాక్ మార్కెట్ తో సమానంగా లాభాలను అందించింది.


స్టాక్ మార్కెట్ vs గోల్డ్ :


ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే లాభమా గోల్డ్ మార్కెట్ లో పెట్టుబడి పెడితే లాభమా అనే సందేహం మీకు కలగవచ్చు. నిజానికి ఎప్పుడైనా సరే పెట్టుబడి పెట్టే సమయంలో మీ పోర్టుఫోలియోను విభజించుకోవాల్సి ఉంటుంది. మీ ఆదాయంలో కొంత భాగం ఈక్విటీ మార్కెట్లలోనూ మరి కొంత భాగం బంగారం పైన మరి కొంత భాగం రియల్ ఎస్టేట్ రంగంలోనూ మరికొంత భాగం బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లయితే, మీ ఆదాయం స్థిరంగా పెరిగే అవకాశం ఉంటుంది.


Also Read: Budget 2024: ఆయుష్మాన్ భారత్ లిమిట్ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచే చాన్స్..నిర్మలమ్మపైనే అందరి ఆశలు..!!



 


Disclaimer: ఈక్విటీ మార్కెట్లలో  పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవి. ఈ కథనంలో ఇక్కడ వ్యక్తీకరించిన అభిప్రాయాలు/సూచనలు/సలహాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. జీ తెలుగు ఎలాంటి షేర్ మార్కెట్ రికమండేషన్స్ ఇవ్వదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు నిపుణులైన సర్టిఫైడ్ ఇన్వెస్ట్ మెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించాలని జీ తెలుగు పాఠకులను సూచిస్తుంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి