OnePlus 10R: ప్రముఖ మొబైల్ దిగ్గజం వన్‌ప్లస్‌ వినియోగదారుల ముందుకు మరో సరికొత్త ఫోన్‌ తీసుకురాబోతోంది. ఈ ఫోన్‌ ద్వారా యూజర్లకు మంచి ఫీచర్లను అందించనుందని సమాచారం. యూజర్ల కోరికలకు అనుగుణంగా ఈ మొబైయిల్‌ను తయారు చేశామని తాజాగా వన్‌ప్లస్ సూచించింది. ఇప్పటికే మిడ్‌రేంజ్‌ మొబైల్‌ వన్‌ప్లస్‌ ఏస్‌ సిరీస్‌ను చైనాలో విడుదల చేయనుంది సంస్థ. అదే మొబైల్‌ తరహాలో  వన్‌ప్లస్‌ 10ఆర్‌గా నామకరణం చేసి భారత్‌లో తీసుకురానున్నారు. సంస్థ సూచించిన వివరాల ప్రకారం...ఈ మొబైల్‌ను ఏప్రిల్‌ 28న జరిగే కార్యక్రమంలో కంపెనీ అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయని సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదిరిపోయే ఫీచర్లు ఇవే:


 #5జీతో వన్‌ప్లస్‌ 10ఆర్‌
#120Hz రిఫ్రెష్‌రేట్‌తో 6.7 అంగుళాల అమోల్డ్‌ డిస్‌ప్లే
#ఆండ్రాయిడ్‌ 12 
#మీడియాటెక్ డైమోన్సిటీ 8100 ప్రాసెసర్‌
#150 వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌
#4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం
#బ్యాక్‌ కెమరా 50ఎంపీ+8ఎంపీ
#అల్ట్రావైడ్‌ సెన్సార్‌+2ఎంపీ మ్యాక్రో షూటర్‌ కెమెరా
#సెల్ఫీల కోసం 16ఎంపీ కెమెరా


మూడు వేరియంట్లలో ఈ ఫోన్‌: 


ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ ఫోన్‌ మూడు వేరియంట్లలో వన్‌ప్లస్‌ వినియోగదారులకు లభించనుందని సమాచారం. దీనిపై పలు రకాల బ్యాంక్‌ ఆఫర్లను కూడా తీసుకురానున్నట్లు సమాచారం. ఇక వేరియంట్ల విషయానికి వస్తే 8జీబీ+256జీబీ వేరియంట్‌ ఉన్న ఫోన్‌ ధర రూ.31,900గా, 12జీబీ+256జీబీ వేరియంట్‌ ఉన్న ఫోన్‌ ధర రూ.35,400గా,  12జీబీ+512జీబీ వేరియంట్‌ ఉన్న ఫోన్‌ ధర రూ.41,400గా తీసుకురానున్నట్లు సమాచారం. ఈ వన్‌ప్లస్‌ 10ఆర్‌ సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ వివరాలను సంస్థ త్వరలోనే వివరించనుంది.


బ్యాటరీ ఫీచర్‌: 


ఈ మొబైల్‌లో 4,500 MAH బ్యాటరీ సామర్థ్యంతో వినియోగదారులకు లభించనుంది. అంతే కాకుండా 150 వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను ఉండడంతో ఈ ఫోన్‌  10 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్‌ చేసుకోవచ్చు. దీంతో 3 నుంచి 4 రోజుల వరకు మంచి బ్యాటరీ ప్యాక్‌ లభించునుంది. 


Also Read:Shraddha Kapoor Photos: చాలా రోజులకు సోషల్ మీడియాలో తళుక్కున మెరిసిన తార!



Also Read:Acharya Pre Release Event: మెగా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్... 'ఆచార్య' ఈవెంట్‌కు దూరంగా పవన్ కల్యాణ్... కారణమిదే...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.